త్రివిక్రమ్-ఎన్టీఆర్ కాంబినేషన్ సినిమా దాదాపు ఖరారైనట్లే. సోషియో, మైథాలజీ కథ ఇది. త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుందని సమాచారం. అయితే ఈ ప్రాజెక్ట్ రాబోవు ఏడాదిలోగా పట్టాలెక్కడం అనుమానమే. ఎందుకంటే.. ఎన్టీఆర్ ప్రస్తుతం ‘డ్రాగన్’ షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఇది పూర్తికావడానికి ఏడాదిపైగా పడుతుందంటున్నారు. ఈ గ్యాప్‌లో వెంకటేష్‌తో సినిమాకు సిద్ధమవుతున్నారు త్రివిక్రమ్. వెంకటేష్ బ్లాక్‌బస్టర్స్ ‘నువ్వు నాకు నచ్చావు’ ‘మల్లీశ్వరి’ చిత్రాలకు త్రివిక్రమ్ మాటల రచయితగా పనిచేశారు.
దీంతో ఈ సక్సెస్ఫుల్ కాంబినేషన్లో రాబోతున్న తాజా సినిమాపై ఆసక్తి పెరిగింది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పూర్వ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయట. ఆగస్ట్‌లో సెట్స్‌పైకి తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా కోసం త్రివిక్రమ్ వినోదాత్మక కుటుంబ కథను సిద్ధం చేశారట. ఆయన శైలి వినోదం, వ్యంగ్యం, భావోద్వేగాల కలబోతగా ఈ సినిమా ఉంటుందని చెబుతున్నారు. త్వరలో ఈ సినిమా ప్రకటన వెలువడనుందని ఫిల్మ్‌నగర్ టాక్.