Nagabandham | టాలీవుడ్లో సనాతన ధర్మం, పురాతన ఆలయాల రహస్యాల నేపథ్యంలో తెరకెక్కిన తాజా సోషియో ఫాంటసీ అడ్వెంచర్ చిత్రం ‘నాగబంధం: ది సీక్రెట్ ట్రెజర్’ (Nagabandham: The Secret Treasure) బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా కొట్టుమిట్టాడుతోంది. సుమారు రూ. 100 కోట్ల భారీ బడ్జెట్‌తో, విరాట్ కర్ణ, నభా నటేష్, ఐశ్వర్య మీనన్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు అభిషేక్ నామా రూపొందించిన ఈ పాన్-ఇండియా చిత్రం జూలై 3న విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో పూర్తిగా విఫలమైంది. ఇటీవలి కాలంలో భక్తి, సనాతన ధర్మం బ్యాక్‌డ్రాప్‌తో వచ్చిన సినిమాలు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోతున్న సంగతి తెలిసిందే. మేకర్స్ ఎంత సనాతనం కార్డు వాడిన సినిమాలో మ్యాటర్ లేకపోతే ప్రేక్షకుల ఆ వైపు కూడా చూడాట్లేదు. అయితే తాజాగా ఈ సినిమా కూడా అలాగే ‘సనాతన కార్డ్’తో రాగా.. బలహీనమైన కథనం, దర్శకత్వ లోపాలు, ఎక్కువ నిడివి కారణంగా థియేటర్లలో అస్సలు వర్కవుట్ కాలేదు.
సినిమాపై భారీ బడ్జెట్ పెట్టినప్పటికీ.. థియేటర్లలో మాత్రం ఈ సినిమా వసూళ్లు అత్యంత ఘోరంగా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2100 స్క్రీన్లలో విడుదలైన ఈ చిత్రం, మొదటి మూడు రోజుల్లో (వీకెండ్) కలిపి ఇండియా నెట్ కలెక్షన్ల పరంగా కేవలం రూ. 9.75 కోట్లు మాత్రమే రాబట్టింది. ఇక గ్రాస్ వసూళ్లు, ఓవర్సీస్ కలెక్షన్లు అన్నీ కలిపినా మొదటి వీకెండ్ ముగిసేసరికి వరల్డ్‌వైడ్ కలెక్షన్లు రూ. 13.70 కోట్ల నుండి రూ. 15 కోట్ల లోపే పరిమితమయ్యాయి. సినిమా రన్‌టైమ్ ఎక్కువ ఉందని దాదాపు 20 నిమిషాలు తగ్గించిన కూడా ఆశించిన స్థాయిలో సినిమా లేకపోవడంతో ప్రేక్షకులు ఈ అడ్వెంచర్ రైడ్‌ను తిరస్కరిస్తున్నారు. జగపతి బాబు, అనసూయ భరద్వాజ్ వంటి భారీ తారాగణం ఉన్నప్పటికీ, బాక్సాఫీస్ వద్ద ‘నాగబంధం’ గట్టెక్కడం కష్టంగానే కనిపిస్తోంది.