బాబా మైలవరం దర్శకత్వంలో శకుంతల ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మితమవుతన్న విభిన్న కథాచిత్రం ‘1=100’. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. నిర్మాత రిజ్వాన్ ముఖ్య అతిథిగా హాజరై టీజర్‌ని ఆవిష్కరించి చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
వెస్ట్రన్ ైస్టెల్ విజువల్స్, యాక్షన్ ఎలిమెంట్స్, కథను ఎలివేట్ చేసే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో ఆసక్తికరంగా టీజర్‌ని కట్ చేయడం జరిగిందని, అంతకు మించి సినిమా ఉంటుందని, ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియజేస్తామని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: అనిల్‌కుమార్ వేగూరు, సంగీతం: కెన్నీ చైతన్య.