Sanatana Dharma | ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలకు పా. రంజిత్ మద్దతు
PA Ranjith | డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ (Udhyanithi Stalin) సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ‘సనాతన ధర్మం’ (Sanatana Dharma) డెంగీ, మలేరియా లాంటిదని, దాన్ని నిర్మూలించాలని ఉదయనిధి స్టాలిన్ పిలుపునిచ్చారు. అయితే ఈ వ్యాఖ్యలకు కబాలి (Kabli), కాలా (Kaala), సార్పట్ట పరంపర (Sarpatta Parambarai) చిత్రాల దర్శకుడు పా. రంజిత్ (PA. Ranjith) మద్దతు ఇచ్చారు.
PA Ranjith | డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ (Udhyanithi Stalin) సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ‘సనాతన ధర్మం’ (Sanatana Dharma) డెంగీ, మలేరియా లాంటిదని, దాన్ని నిర్మూలించాలని ఉదయనిధి స్టాలిన్ పిలుపునిచ్చారు. అయితే ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా మత, రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. స్టాలిన్ వ్యాఖ్యలపై మతపెద్దలు, అర్చకులు, బీజేపీ సహా కొన్ని పార్టీల నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఉదయనిధి మాత్రం తగ్గేదే లే అంటున్నారు. తన వ్యాఖ్యలను సమర్థించుకుంటున్నారు. ఈ క్రమంలో ఆ వ్యాఖ్యలకు కబాలి (Kabli), కాలా (Kaala), సార్పట్ట పరంపర (Sarpatta Parambarai) చిత్రాల దర్శకుడు పా.రంజిత్ (PA. Ranjith) మద్దతు ఇచ్చారు.
“సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి అనేది దశాబ్దాలుగా జరుగుతున్న కుల వ్యతిరేక పోరాటం యొక్క ముఖ్య ఉద్దేశం. కుల వివక్ష, లింగ వివక్ష అనేవి సనాతన ధర్మం నుండి వచ్చినవే. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ (Dr Babasaheb Ambedkar), ఇయోథీదాస్ పండితార్, తంతి పెరియార్ (Thanthi Periyar), మహాత్మా ఫూలే, సంత్ రవిదాస్ వంటి విప్లవకారులు పోరాడింది కూడా కుల వివక్ష నిర్మూలించాలనే.
ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలను కొందరు వక్రీకరించి మారణహోమానికి పిలుపునిస్తున్నారు. ఈ దుర్మార్గపు వైఖరి మంచిది కాదు. స్టాలిన్‌పై చంపేయాలని వస్తున్న ప్రకటనలు.. ఆయనపై పెరుగుతున్న ద్వేషం చాలా కలవరపెడుతోంది.
సామాజిక న్యాయం, సమానత్వంతో కూడిన సమాజాన్ని స్థాపించడానికి సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని పిలుపునిచ్చిన ఉదయనిధి స్టాలిన్ మాటలకు నేను మద్దతుగా నిలుస్తున్నాను. స్టాలిన్‌కి నా సంఘీభావం అంటూ” పా. రంజిత్ ట్విట్టర్లో రాసుకోచ్చాడు.
Minister Udhyanithi’s (@UdhayStalin) statement calling for abolishment of Santana Dharma is the core principle of anti-caste movement for centuries. The roots of inhumane practices in the name of caste and gender lies in the Sanatana Dharma. Revolutionary leader Dr Babasaheb…
— pa.ranjith (@beemji) September 5, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi ప్రభాస్ పుట్టినరోజున ‘ఫౌజీ’ టీజర్ రావడం లేదా .. అభిమానులకు మైత్రీ నవీన్ కీలక అప్డేట్!
ఆటో డ్రైవర్ కుటుంబానికి ఆర్ధిక సాయం
CJP | జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అనుమతివ్వండి.. ఢిల్లీ పోలీసులకు సీజేపీ 24 గంటల డెడ్‌లైన్..!
Manne Krishank | మీ సొంత కూతురే కార్పొరేట్ స్కూల్ నిర్మిస్తున్నది కదా.. రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన మన్నెక్రిశాంక్
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

