వరుణ్‌సందేశ్, వితిక షేరు దంపతులు కలిసి నటిస్తున్న తాజా చిత్రం ‘డియర్ ఆస్ట్రోనాట్’. స్వీయ నిర్మాణ దర్శకత్వంలో కార్తీక్ భాగ్యరాజా రూపొందిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘చిన్నప్పటి నుంచి అంతరిక్షంలోకి వెళ్లాలని, నక్షత్రాల మధ్య విహరించాలని కలలుకనే ఓ మహిళ కథ ఇది.
తన లక్ష్యాన్ని చేరుకోవడానికి ఆమె చేసిన ప్రయత్నాలు, ఎదుర్కొన్న అవరోధాలు ఏమిటన్నది స్ఫూర్తివంతంగా ఉంటుంది. చక్కటి నిర్మాణ విలువలతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాం. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతున్నది. తెలుగు తెరపై కొత్త ప్రయత్నంగా నిలుస్తుందనే నమ్మకం ఉంది’ అన్నారు.