స్లమ్ డాగ్లో విభిన్నంగా..
తమిళ అగ్రనటుడు విజయ్ సేతుపతి కథానాయకుడిగా పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తున్న విభిన్న కథాచిత్రం ‘స్లమ్ డాగ్'. ‘33 టెంపుల్ రోడ్' అనేది ఉపశీర్షిక.
తమిళ అగ్రనటుడు విజయ్ సేతుపతి కథానాయకుడిగా పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తున్న విభిన్న కథాచిత్రం ‘స్లమ్ డాగ్’. ‘33 టెంపుల్ రోడ్’ అనేది ఉపశీర్షిక. పూరి కనెక్ట్స్, జెబి మోహన్ పిక్చర్స్ పతాకాలపై పూరీ జగన్నాథ్, చార్మీ కౌర్, జెబి నారాయణరావు కొండ్రోల్లా నిర్మిస్తున్న ఈ పానిండియా చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్నది. కన్నడ అగ్రనటుడు దునియా విజయ్ ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు. మంగళవారం ఆయన పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఈ సినిమాకు చెందిన ఆయన ఫస్ట్‌లుక్ పోస్టర్ని మేకర్స్ విడుదల చేశారు.
విభిన్నమైన గెటప్‌లో కనిపిస్తున్న దునియా విజయ్‌ని ఈ పోస్టర్లో చూడొచ్చు. ఆయన ఎనర్జిటిక్ ఎక్స్ప్రెషన్ ఆ పాత్రలోని ఇన్టెన్షన్ని తెలియజేస్తున్నది. ఇప్పటివరకూ చేయని భిన్నమైన పాత్రను ఇందులో దునియా విజయ్ చేస్తున్నారని మేకర్స్ తెలిపారు. సంయుక్త మీనన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో టబు కీలక పాత్ర పోషిస్తున్నారు. బ్రహ్మాజీ, వీటీవీ గణేష్, విజయ్‌కుమార్ ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్, సమర్పణ: ఛార్మీ కౌర్, నిర్మాణం: పూరీ కనెక్ట్స్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

