ఎట్టకేలకు విహారయాత్రలు ముగించుకొని మహేశ్‌బాబు హైదరాబాద్ చేరుకున్నారు. రాజమౌళి కూడా జపాన్ పర్యటన ముగించుకొచ్చేశారు. వీరిద్దరి కలయికలో రూపొందుతోన్న ప్రతిష్టాత్మక పానిండియా ప్రాజెక్ట్ ‘SSRMB29’ ప్రారంభం ఆలస్యమైనా.. మొదలైన నాటినుంచి షూటింగ్‌ని మాత్రం జెడ్ స్పీడ్‌తో నడిపించారు రాజమౌళి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన రెండు షెడ్యూల్స్ పూర్తయ్యాయి. మధ్యలో టూర్ వల్ల కాస్త బ్రేక్ పడింది.
అయితే.. ముందుగా ప్లాన్ చేసుకున్న ప్రకారం.. ఈ సినిమా షూటింగ్‌కు కావాల్సిన సరంజామానంతా టీమ్ సైలెంట్‌గా సిద్ధం చేసిపెట్టేయడంతో రాజమౌళి, మహేష్‌లు విదేశాల నుంచి తిరిగి రాగానే.. ఏ హడావిడీ లేకుండా పీస్‌ఫుల్‌గా కొత్త షెడ్యూల్ మొదలైపోయింది. ఈ షెడ్యూల్లో మహేశ్‌బాబు, ప్రియాంక చోప్రా జాయిన్ అయినట్టు తెలుస్తోంది. ఈ షెడ్యూల్లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తారని వినికిడి. దుర్గా ఆర్ట్స్ పతాకంపై కె.ఎల్.నారాయణ నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాకు సంగీతం: ఎం.ఎం.కీరవాణి.