ఆస్కార్‌లో సరికొత్త నిబంధనలు
ప్రపంచ సినిమాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ పురస్కారాల్లో సరికొత్త నిబంధనలు ప్రవేశపెట్టారు. వచ్చే ఏడాది జరగనున్న 99వ ఆస్కార్ అవార్డుల కోసం కమిటీ కీలకమైన మార్పులకు శ్రీకారం చుట్టింది.
ప్రపంచ సినిమాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ పురస్కారాల్లో సరికొత్త నిబంధనలు ప్రవేశపెట్టారు. వచ్చే ఏడాది జరగనున్న 99వ ఆస్కార్ అవార్డుల కోసం కమిటీ కీలకమైన మార్పులకు శ్రీకారం చుట్టింది. తాజా నిబంధనలు నటీనటులకు మేలు చేస్తాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటివరకు నటీనటులందరూ కేవలం ఒక విభాగంలో ఒక చిత్రానికి మాత్రమే నామినేట్ అయ్యే అవకాశం ఉంది. దీంతో భిన్న చిత్రాల్లో అద్భుతమైన ప్రతిభ కనబరచినప్పటికీ కేవలం ఒకే ఒక్క నామినేషన్‌తో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది.
ఇక నుంచి ఈ నిబంధనను సడలించనున్నారు. నటీనటులు వివిధ చిత్రాలకు నామినేట్ చేసుకునే వీలు కల్పిస్తున్నారు. దీంతో వారికి ఆస్కార్ గెలుపు అవకాశాలు కూడా మెరుగవుతాయి. అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో కూడా ఆస్కార్ కమిటీ కీలక మార్పులు చేసింది. విదేశీ చిత్రాల కేటగిరిలో గతంలో ప్రతి దేశం ఒకే చిత్రాన్ని నామినేట్ చేయాల్సి ఉండేది. ఇప్పుడు ఒకటి కంటే ఎక్కువ చిత్రాల్ని పరిశీలనకు పంపవచ్చు. దీనితో పాటు కేన్స్ వంటి అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో అవార్డులు గెలుచుకున్న చిత్రాలు నేరుగా ఆస్కార్ బరిలో పోటీపడే అవకాశాన్ని కల్పిస్తూ నిబంధనలను సవరించారు.
కృత్రిమమేధ కంటెంట్‌పై నిషేధం
ఏఐ (కృత్రిమ మేధ) కంటెంట్ విషయంలో కూడా ఆస్కార్ అకాడమీ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఏఐ సహాయంతో తయారు చేసిన స్క్రిప్ట్‌లు, రూపొందించిన రచనలను పరిగణనలోకి తీసుకోబోమని తేల్చిచెప్పింది. అలాగే ఏఐతో సృష్టించిన సన్నివేశాలను కూడా ఆమోదించమని తెలియజేసింది. వచ్చే ఏడాది మార్చిలో ఆస్కార్ 99వ పురస్కారాల ప్రదానం జరుగనుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Destiny | నందినీ రెడ్డి చేతుల మీదుగా ‘డెస్టినీ’ ఫస్ట్ లుక్ లాంచ్.. ఇంట్రెస్టింగ్గా ఇమ్మాన్యుయేల్ లుక్!
శ్రీ రామలింగేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్‌ను సత్వరమే పూర్తి చేయాలి : మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్
KTR | సహకార సంఘాల బలోపేతానికి బీఆర్ఎస్ సహకారం : కేటీఆర్
Plague Disease | ప్లేగు వ్యాధిలో అసలు ఎన్ని రకాలు ఉన్నాయి.. ఈ వ్యాధి ఎలా వస్తుంది..?
PM Modi | కెనడాలో పర్యటించనున్న ప్రధాని మోదీ.. డిసెంబర్ 11, 12 తేదీల్లో షెడ్యూల్ ఖరారు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

