న్యూఢిల్లీ: పేటీఎం వ్యవస్థాపకుడు, సీఈవో విజయ్ శేఖర్ శర్మ ఇవాళ కీలక ప్రకటన చేశారు. మీ ఫెవరేట్ యాప్(Paytm App) పనిచేస్తోందని ఆయన తన సోషల్ మీడియా అకౌంట్లో ట్వీట్ చేశారు. ఫిబ్రవరి 29 తర్వాత కూడా తమ యాప్ పనిచేస్తుందని ఆయన అన్నారు. తమకు మద్దతు ఇస్తున్న యూజర్లకు ఆయన థ్యాంక్స్ తెలిపారు. పేటీఎంపై ఇటీవల ఆర్బీఐ ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. కస్టమర్ అకౌంట్లు, వ్యాలెట్లు, ఫాస్టాగ్స్, నేషనల్ కామన్ మొబిలిటీ కార్డు (ఎన్సీఎంసీ)లు, ఇతర సాధనాల్లో టాప్-అప్లు లేదా డిపాజిట్లను అంగీకరించడానికి వీల్లేదని పీపీబీఎల్‌కు ఆర్బీఐ తేల్చి చెప్పింది.
“Your favourite #Paytm app is working & will keep working beyond 29th Feb, 2024 as well,” tweets our Founder and CEO @vijayshekhar. Read here! #PaytmKaro pic.twitter.com/CDcTyVuQGg
— Paytm (@Paytm) February 2, 2024
ఈ నేపథ్యంలో పేటీఎం సీఈవో విజయ్ శేఖర్ శర్మ స్పందించారు. ప్రతి సవాల్‌కు ఓ పరిష్కారం ఉంటుందని, దేశానికి సేవ చేసేందుకు పూర్తి స్థాయిలో కట్టుబడి ఉన్నామని ఆయన తన ట్వీట్లో పేర్కొన్నారు. పేటీఎం ఆవిష్కరణతో ప్రపంచవ్యాప్తంగా భారత్‌కు గుర్తింపు ఉందని, ఆర్థిక సేవల్లో తమ కంపెనీ నిమగ్నం అవుతుందని, పేటీఎం కరో ఓ చాంపియన్‌గా నిలుస్తుందన్నారు. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై ఆంక్షలు విధించిన సందర్భంగా పేటీఎం సీఈవో దీనిపై క్లారిటీ ఇచ్చారు.