Smart Phone offer: ఎస్బీఐ కార్డుతో కొంటే ఆ స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్..!
Smart Phone: చైనాకు చెందిన షావోమీ కంపెనీ ఐదు నెలల క్రితం రిలీజ్ చేసిన రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్ మోడల్ స్మార్ట్ ఫోన్ బాగా పాపులర్ అయ్యింది. ఈ పాపులర్ స్మార్ట్‌ఫోన్‌ను వినియోగదారులు

న్యూఢిల్లీ: చైనాకు చెందిన షావోమీ కంపెనీ ఐదు నెలల క్రితం రిలీజ్ చేసిన రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్ మోడల్ స్మార్ట్ ఫోన్ ( Smart Phone ) బాగా పాపులర్ అయ్యింది. ఈ పాపులర్ స్మార్ట్‌ఫోన్‌ను వినియోగదారులు ఎగబడి కొనుగోలు చేశారు. ఇంత పాపులారిటీ సాధించిన ఈ ఫోన్ ఇప్పుడు సాధారణ ధర కంటే రూ.2,750 తక్కువకే మీ సొంతం కానుంది. ప్రస్తుతం అమెజాన్‌లో కొనసాగుతున్న గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్‌లో ఫోన్ కొనుగోలు చేసిన వారికి ఈ ఆఫర్ అమలు కానుంది.
రెడ్మీ నోట్ 10 సిరీస్‌లో రిలీజ్ చేసిన రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్ స్మార్ట్‌ఫోన్‌పై కూపన్ ఆఫర్‌తో పాటు ఎస్బీఐ కార్డ్ ఆఫర్ కూడా ఉన్నది. రెండు ఆఫర్లు కలిపి రూ.2,750 డిస్కౌంట్‌తో రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్ స్మార్ట్‌ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు. రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్ 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.19,999గా, అదేవిధంగా 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.21,999గా ఉన్నది.
ఆగస్టు 9 వరకు ఆఫర్ అందుబాటులో..

6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్‌పై రూ.1,000 కూపన్ లభిస్తుంది. ఇక రెండు వేరియంట్లపైనా ఎస్బీఐ కార్డుతో రూ.1,750 ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. అంటే రూ.19,999 విలువైన రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్ 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ఫోన్‌ను కూపన్, ఎస్బీఐ కార్డ్ డిస్కౌంట్‌తో కలిపి రూ.17,249కే సొంతం చేసుకోవచ్చు. ఆగస్టు 9న అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ ముగిసేవరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది.
రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్ స్మార్ట్‌ఫోన్ గత మార్చిలో రిలీజ్ అయింది. రెడ్మీ నోట్ 10 సిరీస్‌లో ఈ స్మార్ట్ఫోన్తోపాటు రెడ్మీ నోట్ 10, రెడ్మీ నోట్ 10 ప్రో కూడా వచ్చాయి. ఆ తర్వాత రెడ్మీ నోట్ 10ఎస్, రెడ్మీ నోట్ 10టీ 5జీ మోడల్స్ కూడా రిలీజ్ అయ్యాయి. రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే.. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.67 అంగుళాల ఫుల్ హెచ్డీ+ సూపర్ అమొలెడ్ డిస్ప్లే ఉంది. ఈ మొబైల్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 732జీ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.
ఇవి కూడా చదవండి
PM Modi: పథకం ఏదైనా పేదలకే ప్రాధాన్యం: ప్రధాని మోదీ
Photoshoot : ఫోజుకు సిగ్గుపడి వరుడిని కొలనులోకి తోసిన వధువు.. వైరల్ వీడియో
Bumper offer : బైకు కొంటే హెల్మెట్ ఫ్రీ.. ఈ బంపర్ ఆఫర్ ఎక్కడో తెలుసా..!
Chief Justice : దర్యాప్తు సంస్థల తీరుపై సీజేఐ సంచలన వ్యాఖ్యలు..!
మనవడితో కలిసి బామ్మ నాగినీ డ్యాన్స్.. వైరల్ వీడియో
Video viral : ఓ యువజంట బరితెగింపు.. రన్నింగ్ బైక్‌పైనే రొమాన్స్..!
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

