న్యూఢిల్లీ, అక్టోబర్ 31: యోగా గురువు బాబా రాందేవ్నకు చెందిన పతంజలి ఫుడ్స్ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికిగాను సంస్థ రూ.516.69 కోట్ల నికర లాభాన్ని గడించింది. క్రితం ఏడాది ఇదే కాలానికి నమోదైన రూ.308.58 కోట్ల లాభంతో పోలిస్తే 67 శాతం ఎగబాకింది.
సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం రూ.8,132.76 కోట్ల నుంచి రూ.9,850.06 కోట్లకు చేరుకున్నది.