న్యూఢిల్లీ, అక్టోబర్ 4: మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన ఎఫ్‌జెడ్-ఎస్ ఎఫ్ఐ వీ4ని నూతనంగా తీర్చిదిద్ది మళ్లీ విపణిలోకి ప్రవేశపెట్టింది యమహా మోటర్స్. రెండు కలర్స్‌లో లభించనున్న ఈ బైకు ధర రూ.1,28,900గా నిర్ణయించింది. ఈ ధరలు ఢిల్లీ షోరూంనకు సంబంధించినవి.
ప్రస్తుత పండుగ సీజన్లో అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ బైకుతో విక్రయాలు ఊపందుకునే అవకాశం ఉన్నదని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. 149సీసీ ఇంజిన్‌తో తయారైన ఈ బైకును బ్లూటూత్‌తో కనెక్ట్ చేసుకునే అవకాశం ఉన్నది