Yamaha MT-03 | ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ యమహా మోటార్ ఇండియా (Yamaha Motor India) బైక్ రైడర్లకు తీపి కబురందించింది. యమహా ఎంటీ -03 (Yamaha MT-03) మోటారు సైకిల్‌పై భారీగా ధర తగ్గించింది. శనివారం (2025 ఫిబ్రవరి 1) నుంచి రూ.1.10 ధర తగ్గిస్తున్నట్లు శుక్రవారం తెలిపింది. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి యమహా ఎంటీ-03 (Yamaha MT-03) మోటార్ సైకిల్ రూ. 3.49 లక్షలు (ఎక్స్ షోరూమ్) పలుకుతుంది. ప్రీమియం మోటారు సైకిళ్ల సెగ్మెంట్లో కేటీఎం డ్యూక్ 390 (KTM Duke 390), బీఎండబ్ల్యూ జీ 310 ఆర్ (BMW G310 R)మోటార్ సైకిళ్లకు యమహా ఎంటీ-03 మోటార్ సైకిల్ పోటీ ఇస్తుంది. యమహా ఎంటీ-03 (Yamaha MT-03) మోటారు సైకిల్ కంప్లీట్లీ బిల్ట్ అప్ (సీబీయూ) రూపంలో విదేశాల నుంచి దిగుమతి అవుతుంది. యమహా ఎంటీ-03 మోటార్ సైకిల్ లాంచింగ్ ధర రూ. 4.60 లక్షలు (ఎక్స్ షోరూమ్) కాగా, రూ.1.10 లక్షల ధర తగ్గింపుతో రూ.3.49 లక్షల (ఎక్స్ షోరూమ్)కు లభిస్తుంది. కేటీఎం డ్యూక్ 390 మోటార్ సైకిల్ ధర రూ.3.13 లక్షలు (ఎక్స్ షోరూమ్) పలుకుతుంది.
యమహా ఎంటీ-03 (Yamaha MT-03) మోటార్ సైకిల్ 321సీసీ లిక్విడ్ కూల్డ్, ట్విన్ సిలిండర్ ఇంజిన్‌తో వస్తోంది. ఈ ఇంజిన్ 10,750 ఆర్పీఎం వద్ద 41 బీహెచ్పీ విద్యుత్, 9,000 ఆర్పీఎం వద్ద 29.5 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది. 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తోంది. యమహా ఎంటీ-03 మోటార్ సైకిల్ సీటు 780 మి.మీ ఎత్తు, 1380 మిమీ వీల్ బేస్, 160 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్, 167 కిలోల వెయిట్ ఉంటుంది. ఫ్రంట్‌లో 298 ఎంఎం డిస్క్, 220 ఎంఎం రేర్ డిస్క్ ఉంటాయి. ఈ రెండు డ్యుయల్ చానెల్ ఏబీఎస్‌తో వస్తున్నాయి.
ఇంజిన్ – 321సీసీ లిక్విడ్ కూల్డ్
పవర్ – 10,750 ఆర్పీఎం వద్ద 41 బీహెచ్పీ
టార్క్ – 9,000 ఆర్పీఎం వద్ద 29.5 ఎన్ఎం
గేర్ బాక్స్ – 6- స్పీడ్
యమహా ఎంటీ-3 – రూ.3.49 లక్షలు
కేటీఎం 390 డ్యూక్ – రూ.3.13 లక్షలు
బీఎండబ్ల్యూ జీ 310 ఆర్ – రూ.2.90 లక్షలు