Yamaha | చెన్నై, సెప్టెంబర్ 14: స్పోర్ట్స్ బైకుల విభాగంలో పోటీని మరింత పెంచే ఉద్దేశంలో భాగంగా యమహా మోటర్ సరికొత్త బైకును అందుబాటులోకి తీసుకొచ్చింది. కార్బన్ ఫైబర్ ప్యాటర్న్ గ్రాఫిక్‌తో రూపొందించిన ఆర్15ఎం బైకును మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. 155 సీసీ ఇంజిన్‌తో తయారైన ఈ బైకు ధర రూ.2,08,300గా నిర్ణయించింది. ఈ ధరలు ఢిల్లీ షోరూంనకు సంబంధించినవి. అలాగే దీంతోపాటు ఆర్15 ఎం మెటాలిక్ గ్రే కలర్ మాడల్ ధర రూ.1,98,300.