చెన్నై, మార్చి 11: ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ యమహా మోటర్..దేశీయంగా అత్యంత ప్రజాదరణ పొందిన మోటర్‌సైకిల్ ఎఫ్‌జెడ్-ఎస్-ఎఫ్ఐ హైబ్రిడ్ నయీ మాడల్‌ను పరిచయం చేసింది. ఈ బైకు ధర రూ.1.44 లక్షలు(చెన్నై షోరూంనకు సంబంధించినవి). పాత మాడల్‌తో పోలిస్తే నయా మాడల్‌లో టెక్నాలజీ పరంగా అప్‌గ్రేడ్ చేసి విడుదల చేసింది. 149 సీసీ బ్లూకోర్ ఇంజిన్‌తో తయారైన ఈ బైకు ఓబీడీ-2బీ స్టాండర్డ్, స్మార్ట్ మోటర్ జనరేటర్, స్టాప్-స్టార్ట్ ఎకోసిస్టమ్ వంటి ఫీచర్స్ ఉన్నాయి.
ఓబీడీ-2బీ అంటే సెన్సార్ పనితీరు మెరుగుపడటంతోపాటు ఇంజిన్ పనితీరును డ్రైవింగ్ సమయంలోనే గుర్తించవచ్చును. దేశీయంగా ఎఫ్‌జెడ్ బ్రాండ్ నాటుకుపోయిందని, ప్రతి జనరేషన్‌కు నచ్చే విధంగా పలు మాడళ్లను రూపొందించినట్లు, ఇదే క్రమంలో యువత కోరుకుంటున్న విధంగా ఈ మాడల్‌ను తీర్చి దిద్దినట్లు కంపెనీ చైర్మన్ ఒటానీ తెలిపారు.