బెంగళూరు, జూలై 9: ప్రముఖ స్మార్ట్ఫోన్ల తయారీ కంపెనీ, చైనాకు చెందిన షియామీ.. తొలిసారిగా రూపొందించిన విద్యుత్తు ఆధారిత వాహనం (ఈవీ) ఆకట్టుకుంటున్నది. స్పీడ్ అల్ట్రా (ఎస్‌యూ)7 పేరుతో తెచ్చిన ఈ కారును.. భారతీయ మార్కెట్లో తమ 10వ వార్షికోత్సవం సందర్భంగా మంగళవారం ఇక్కడ షియామీ ప్రదర్శించింది. దేశీయ విపణిలోకి ఇంకా రాని ఈ కారు ప్రారంభ ధర 30 వేల డాలర్లలోపే (రూ.25 లక్షలు).
ఇది చైనాలో టెస్లా మాడల్ 3 ప్రారంభ ధర కన్నా 4 వేల డాలర్లు తక్కువే కావడం గమనార్హం. చైనాలో ఈ ఏడాది మార్చి నుంచి ఎస్‌యూ7 అమ్మకాలు మొదలవగా.. కొనుగోలుదారుల నుంచి విశేష స్పందన లభిస్తున్నది. ఈ-మోటర్, సీటీబీ ఇంటిగ్రేటెడ్ బ్యాటరీ, షియామీ డై-క్యాస్టింగ్, షియామీ పైలట్ అటానమస్ డ్రైవింగ్, స్మార్ట్ క్యాబిన్ అనే ఐదు కీలక ఈవీ టెక్నాలజీలను ఈ కారులో వాడారు.
మొబైల్ గిరాకీ లేకనే..
మార్కెట్లో స్మార్ట్ఫోన్లకు డిమాండ్ పడిపోతున్న నేపథ్యంలోనే షియామీ.. ఆటోమొబైల్ రంగం వైపు అడుగులు వేసిందని అంటున్నారు. నిజానికి 2021లోనే ఈవీల తయారీ దిశగా సంస్థ వెళ్లింది. దశాబ్దకాలంలో 10 బిలియన్ డాలర్ల పెట్టుబడులే లక్ష్యంగా ముందుకు కదిలింది. ఈ క్రమంలోనే గత ఏడాది డిసెంబర్లో ‘సూపర్ ఎలక్ట్రిక్ మోటర్’ టెక్నాలజీతో ఎస్‌యూ7 పరిచయమైంది.
టెస్లా, పోర్షే ఎలక్ట్రిక్ వాహనాల కన్నా మించిన వేగంతో ఈ కారు దూసుకుపోగలదని షియామీ చెప్తున్నది. కాగా, బీజింగ్‌లోని ఓ ఫ్యాక్టరీలో ప్రభుత్వ రంగ సంస్థ బీఏఐసీ గ్రూప్ అనుబంధ కంపెనీయే షియామీ కార్లను తయారు చేయబోతున్నట్టు చెప్తున్నారు. వార్షిక సామర్థ్యం 2 లక్షల కార్లు. ఇదిలావుంటే మే నెలతో పోల్చితే గత నెల జూన్‌లో దేశీయంగా ఈవీల అమ్మకాలు 14 శాతం పడిపోయాయి. ప్రభుత్వ విధానాల్లో మార్పులు, హైబ్రిడ్ వాహనాలపై పెరుగుతున్న ఆసక్తి కారణమంటున్నారు.
ఎస్‌యూ7 విశేషాలు