Xiaomi Mix Fold 3 | చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ షియోమీ.. వచ్చేనెలలో షియోమీ మిక్స్ ఫోల్డ్ 3 అనే పేరుతో ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ ఆవిష్కరించనున్నది. ఈ ఫోన్లో లైకా ట్యూన్డ్ కెమెరాలతో కూడిన క్వాడ్ రేర్ కమెరా సెటప్ ఉంటుంది.
Xiaomi Mix Fold 3 | ప్రతి ఒక్కరూ మిడ్ రేంజ్ నుంచి ప్రీమియం.. ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్లపై మోజు పెంచుకుంటున్నారు. స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థలన్నీ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్లపై ఫోకస్ చేస్తున్నాయి. అదే బాటలో చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ షియోమీ ప్రయాణిస్తోంది. షియోమీ మిక్స్ ఫోల్డ్ 3 (Xiaomi Mix Fold 3) ఫోన్‌ను త్వరలో విడుదల చేయనున్నది. లైసా ట్యూన్డ్ కెమెరాలతో రూపుదిద్దుకున్న షియోమీ మిక్స్ ఫోల్డ్3 (Xiaomi Mix Fold 3) ఫోన్ వచ్చేనెలలో మార్కెట్లో ఆవిష్కరిస్తామని సంస్థ ఫౌండర్ కం సీఈఓ లీ జున్ ధ్రువీకరించారు. గతేడాది ఆగస్టులో ఆవిష్కరించిన షియోమీ మిక్స్ ఫోల్డ్2కు కొనసాగింపుగా షియోమీ మిక్స్ ఫోల్డ్ 3 వస్తున్నది. షియోమీ మిక్స్ 2 ఫోల్డ్ ఫోన్ ఒక్టాకోర్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 ఎస్వోసీ చిప్సెట్, 4500 ఎంఏహెచ్ కెపాసిటీతో కూడిన బ్యాటరీ విత్ 67 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో వచ్చింది.
షియోమీ మిక్స్ ఫోల్డ్ 3 (Xiaomi Mix Fold 3) ఫోన్లో మైక్రో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్) మోటార్స్, ఆల్ట్రా స్లిమ్ హై రీఫ్రాక్టివ్ లెన్స్‌తో కూడిన కెమెరాలు ఉంటాయి. అత్యంత స్లిమ్‌గా, లైట్ వెయిట్ బుక్ స్టయిల్ ఫోల్డబుల్‌గా ఫోన్ ఉంటుంది. క్వాడ్ కెమెరా యూనిట్ ఆఫర్ చేస్తారు. బ్లాక్ కలర్ వేరియంట్‌తో వస్తున్నదని భావిస్తున్నారు.
8.02-అంగుళాల ఫుల్ హెచ్డీ + (2400×1080 పిక్సెల్స్) ఇన్నర్ డిస్ ప్లే, 6.5-అంగుళాల కవర్ పానెల్.. బాత్ విత్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతో వస్తాయని అంటున్నారు. ఒక్టాకోర్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 ఎస్వోసీ చిప్ సిట్ విత్ 16 జీబీ ఎల్పీడీడీడీఆర్5ఎక్స్ రామ్ అండ్ ఒక టిగాబైట్ యూఎఫ్ఎస్ 4.0 ఇన్ బిల్ట్ స్టోరేజీ ఆప్షన్ ఉంటుంది.
లాంగ్ రేంజ్ జూమ్ కోసం 5x పెరిస్కోప్ లెన్స్, 3.2 రెట్లు జూమ్ పెంచుకునేలా జూమ్ లెన్స్‌తో కూడిన లైకా ట్యూన్డ్ క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది. అండ్ 50 వాట్లు లేదా 67 వాట్ల వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో 4800 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ వస్తున్నదని తెలుస్తున్నది.