బీజింగ్ : ఈ ఏడాది డిసెంబర్లో షియామి 12 మినీని లాంఛ్ చేసేందుకు షియామీ సన్నాహాలు చేస్తోంది. వచ్చే నెలలో షియామి 12 సిరీస్ లాంఛ్‌లో భాగంగా షియామి 12 మినీని కూడా కస్టమర్ల ముందుకు తీసుకువచ్చేందుకు కంపెనీ ఏర్పాట్లు చేస్తోంది. డిసెంబర్లో షియామి 12, షియామి 12 ప్రొ, షియామి 12 అల్ట్రా, షియామి 12 మినీ ఫోన్లను ఒకేసారి షియామి లాంఛ్ చేయవచ్చని భావిస్తున్నారు.
ఇక షియామి 12 మినీ స్పెసిఫికేషన్లను ట్విట్టర్ యూజర్ మయాంక్ కుమార్ షేర్ చేశారు. షియామి 12 మినీ చైనాలో డిసెంబర్ 21న లాంఛ్ అవుతుందని కుమార్ వెల్లడించారు. షియామి 12 మినీ 6.28 ఇంచ్‌ల డిస్ప్లేతో ఫుల్హెచ్డీ, ఫ్లాట్ అమోల్డ్ డిస్ప్లేను కలిగిఉంటుంది. వేరియంట్లు, మోడల్‌ను బట్టి షియామి 12 మినీ రూ 42,000 నుంచి రూ 50,150 మధ్య అందుబాటులో ఉంటుంది.