Xiaomi Redmi A1+ | చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం షియోమీ.. భారత్ మార్కెట్లోకి ‘రెడ్మీ ఏ1+’ ఫోన్‌ను ఆవిష్కరించింది. ఇది భారత్‌లో సరికొత్త ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్. ప్రస్తుత ఫెస్టివ్ సీజన్లో 4జీ సేవలందించే లో బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ఇది. రూ. 6,999లకే ఈ ఫోన్ లభ్యం అవుతుంది. 5000ఎంఏహెచ్ సామర్థ్యం గల బ్యాటరీతోపాటు 6.52 అంగుళాల హెచ్డీ+ స్క్రీన్ ఫీచర్ కలిగి ఉంది. ఈ నెల
రెడ్మీ ఏ1+ ఫోన్ ఈ నెల 17 మధ్యాహ్నం రెండు గంటల నుంచి అమ్మకాలు మొదలవుతాయి. రెండు వేరియంట్లలో ఈ ఫోన్ లభ్యం అవుతుంది. ఆన్లైన్, ఆఫ్‌లైన్ మార్కెట్లలోనూ కొనుగోలు చేయొచ్చు. లైట్ గ్రీన్, బ్లాక్, లైట్‌బ్లూ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ పొందొచ్చు.
3జీ రామ్ వేరియంట్ ఫోన్ రూ.7,999లకు, 2జీబీ రామ్ వేరియంట్ ఫోన్ రూ. 6,999లకు సొంతం చేసుకోవచ్చు. రామ్ మినహా అన్ని ఫీచర్లు రెండు వేరియంట్లలో లభిస్తాయి. రెడ్ మీ ఎ1+ ఫోన్లో 32జీబీ స్టోరేజీ కెపాసిటీ ఉంటుంది. ఎస్డీ కార్డ్ సాయంతో దీన్ని 512 జీబీ కెపాసిటీకి పెంచుకోవచ్చు.
8మెగా పిక్సెల్ (ఎంపీ) డ్యుయల్ రేర్ కెమెరా విత్ 6.52-అంగుళాల హెచ్డీ + డాట్ డ్రాప్ డిస్ప్లే కలిగి ఉంటుంది. ఫ్రంట్ కెమెరా 5 ఎంపీ సామర్థ్యం కలిగి ఉంటుంది. కెమెరాలో పొట్రయిట్, హెచ్డీఆర్ మోడ్ కూడా ఉంటాయి. క్యాప్చరింగ్ షార్ట్ వీడియోలు, టైం ల్యాప్స్ ఫొటొగ్రఫీ ఫెసిలిటీ కూడా ఉంటుంది.
10వాట్ల చార్జర్‌తోపాటు 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తున్న ఈ ఫోన్ చార్జింగ్ చేస్తే 30 గంటలు కాల్స్ చేయొచ్చు. 31.5 గంటల వరకు కాలింగ్ ఫెసిలిటీ ఉంటుందని రెడ్మీ ప్రకటించింది. సింగిల్ ఫుల్ చార్జీతో 30 రోజులపాటు మొబైల్ స్టాండ్‌బైగా ఉంటుంది. 30 గంటల వీడియో ప్లేబ్యాక్, 171 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్ సామర్థ్యం ఉంటుందని రెడ్మీ పేర్కొంది.
డ్యుయల్ సిమ్ సపోర్ట్ కలిగి ఉండే రెడ్మీ ఏ1+ ఫోన్.. ఎస్డీ కార్డ్‌కు సపోర్ట్ చేస్తుంది. బ్లూటూత్, వై-ఫై, ఎఫ్ఎం రేడియో కనెక్టివిటీ ఉంటుంది. హెడ్ ఫోన్ కనెక్షన్ కోసం 3.5ఎంఎం ఆడియో జాక్ అందిస్తోంది రెడ్మీ ఏ1+. యాక్సిలరోమీటర్ సెన్సర్‌తోపాటు రేర్ ఫింగర్ ప్రింటర్ సెన్సర్ కూడా లభ్యం అవుతుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 గో ఎడిషన్‌పై పని చేస్తుంది. మీడియా టెక్ హెలలియో ఏ22 ప్రాసెసర్, 120 హెర్ట్జ్స్ వద్ద రీఫ్రెష్ అవుతుంది. యూజర్లకు ఫోన్‌తోపాటు చార్జింగ్ అడాప్టర్, యూఎస్బీ కేబుల్, సిమ్ ఎజెక్టర్ టూల్, వారంటీ కార్డ్ కూడా అందిస్తారు.