Redmi 5G Phone | హైదరాబాద్, జనవరి 8: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ షియోమీ.. దేశీయ మార్కెట్లోకి చౌక ధరకలిగిన 5జీ స్మార్ట్ఫోన్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. రెడ్మీ నోట్ 14 సిరీస్లో భాగంగా విడుదల చేసిన ఈ స్మార్ట్ఫోన్ రూ.9,999 ప్రారంభ ధర కాగా, గరిష్ఠంగా రూ.11,999కి లభించనున్నది.
6.88 ఇంచుల హెచ్డీ-డాట్ డ్రాప్ డిస్ప్లేతో తయారైన ఈ స్మార్ట్ఫోన్ స్నాప్డ్రాగన్ 4 జెన్ 2 5జీ ప్రాసెసర్, 12 జీబీ ర్యామ్, 50 మెగాపిక్సెల్ ఏఐ డ్యూయల్ కెమెరా సిస్టమ్, 5160 మెగావాట్ల బ్యాటరీ, 128 జీబీ మెమొరీని 1 టీబీకి పెంచుకునే విధంగా తయారు చేసింది.