Xiaomi 14 | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ షియోమీ తన షియోమీ 14 సిరీస్ ఫోన్లను ఈ నెల 25న గ్లోబల్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది. గతేడాది అక్టోబర్లో షియోమీ 14, షియోమీ 14 ప్రో ఫోన్లను చైనా మార్కెట్లో ఆవిష్కరించారు. ఈ రెండు ఫోన్లతోపాటు గ్లోబల్ మార్కెట్లలో షియోమీ 14 ఆల్ట్రా మోడల్ ఫోన్ కూడా ఆవిష్కరిస్తారు. షియోమీ 14 ఆల్ట్రా ఫోన్ 6.73 అంగుళాల క్యూహెచ్డీ + అమోలెడ్ ఎల్టీపీఓ డిస్ ప్లే విత్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 ఎస్వోసీ చిప్ సెట్ కలిగి ఉంటుందని చెబుతున్నారు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 బేస్డ్ హైపర్ ఓఎస్ వర్షన్ పై పని చేస్తుంది.
షియోమీ 14 ఆల్ట్రా ఫోన్ లైకా బ్యాక్డ్ ట్రిపుల్ రేర్ కెమెరా యూనిట్ కలిగి ఉంటుంది. 50-మెగా పిక్సెల్ 1-అంగుళం ప్రైమరీ కెమెరా, 50-మెగా పిక్సెల్ సెన్సర్ విత్ ఆల్ట్రా వైడ్ లెన్స్, మరో రెండు 50-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరాలు ఉంటాయి. రెండు 50-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరాల్లో ఒకటి 3ఎక్స్, మరొకటి 5ఎక్స్ జూమ్ కెపాసిటీ కలిగి ఉంటాయి. ఇక సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 32-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా ఉంటుంది. 90వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5300 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ మద్దతు కలిగి ఉంటుందని భావిస్తున్నారు. అయితే షియోమీ 14 ఆల్ట్రాతోపాటు ఇతర సిరీస్ ఫోన్ల ధరలు ఇంకా వెల్లడించలేదు.