లండన్ : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేక రంగాల్లో సమూల మార్పులను తీసుకువస్తోంది. ఆహార పరిశ్రమ కూడా ఇందుకు మినహాయింపు కాదు. ఈ ఒరవడిలో బ్రిటన్‌కు చెందిన స్టార్టప్ సీర్గ్రిల్స్ ప్రపంచంలోనే తొలి, వేగవంతమైన ఏఐ ఆధారిత గ్రిల్ (AI Powered Grill) పర్ఫెక్టాను లాంఛ్ చేసింది. కేవలం మూడు నిమిషాల్లోపే ఈ ఏఐ గ్రిల్ ఆటోమేటిక్, పర్ఫెక్ట్ ఫలితాలను అందిస్తుందని సీర్గ్రిల్స్ చెబుతోంది. ఏఐ ఆధారిత గ్రిల్ కావడంతో యూజర్ల కమాండ్స్‌కు ఇది నేరుగా స్పందిస్తుంది. మీకు ఎలా కావాలా, మీరు ఏం కోరుకుంటున్నారో పర్ఫెక్టాకు చెబితే చాలు కేవలం కొన్ని నిమిషాల్లోనే పసందైన విందును పర్ఫెక్టా మీకు ఆఫర్ చేస్తుందని కంపెనీ అధికారిక సైట్ వెల్లడించింది.
ఈ పరికరాన్ని సీర్గ్రిల్స్ ఫౌండర్, ఆస్టన్ యూనివర్సిటీ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ సూరజ్ సుదేరా డిజైన్ చేశాడు. ఆహారం వండటంలో తరచూ కష్టాలు, నిలకడ లోపించడం చూస్తుంటాం..ఎప్పుడూ అతిగా వండటం లేదా డ్రై, ఆపై ఎక్కువ సమయం వంటగదిలోనే కూరుకుపోవడం వంటివి కామన్‌గా కనిపిస్తుంటాయని వీటిని అధిగమించేందుకు పర్ఫెక్టా సరైన పరిష్కారంగా పనిచేస్తుందని సూరజ్ పేర్కొన్నారు.
న్యురాల్ఫైర్ టెక్నాలజీతో ముందుకొచ్చిన పర్ఫెక్టా డ్యూయల్ వర్టికల్ ఇన్ఫ్రా రెడ్ బర్నర్స్ను కలిగిఉంటుంది. ఈ డివైజ్ ఏఐ అల్గారిథమ్స్, స్మార్ట్ సెన్సర్ల కాంబినేషన్ ఆధారంగా పనిచేస్తుంది. పర్ఫెక్టాతో కేవలం 1.30 నిమిషాల్లో బర్గర్ సిద్ధమైతే, 2.30 నిమిషాల్లో చికెన్, ఫిష్‌ను 2 నిమిషాల్లో రెడీ చేస్తుంది. పిజ్జాలు, బర్గర్స్‌ను కూడా చిటికెలో తయారుచేస్తుంది. ఈ అత్యాధునిక స్మార్ట్ అప్లయన్స్ ధర ఇండియన్ కరెన్సీలో రూ. 2.9 లక్షలని కంపెనీ పేర్కొంది.
Read more :
Skanda Movie | స్కంద రిజల్ట్ రామ్ ముందే ఊహించాడా.. అందుకే అలా చేశాడా?