న్యూఢిల్లీ, సెప్టెంబర్ 3: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ 7 శాతం వృద్ధిని సాధించనున్నదని వరల్డ్ బ్యాంక్ తాజాగా అంచనాను విడుదల చేసింది. వ్యవసాయరంగం, గ్రామాల్లో డిమాం డ్ మళ్లీ పుంజుకోవడంతో ఈసారి వృద్ధి అంచనాను సవరించినట్లు తెలిపింది.
అంతర్జాతీయ దేశాల్లో ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నప్పటికీ భారత్ మాత్రం మరింత బలోపేతం అవుతున్నదని, దక్షిణాసియా దేశాల్లో అత్యధిక వృద్ధిని సాధిస్తున్న దేశం కూడా భారతేనని స్పష్టంచేసింది.