17 గంటలకో బిలియనీర్.. టాప్‌లో జెఫ్ బెజోస్
17 గంటలకో బిలియనీర్| కరోనా మహమ్మారి ముప్పు తిప్పలు పెడుతున్నా బిలియనీర్ల క్లబ్ పలు రెట్లు పెరుగుతున్నది. ఈ క్లబ్లో సగటున 17 గంటలకో ...

న్యూఢిల్లీ: మానవాళిని కరోనా మహమ్మారి ముప్పు తిప్పలు పెడుతున్నా బిలియనీర్ల క్లబ్ పలు రెట్లు పెరుగుతున్నది. ఈ క్లబ్లో సగటున ప్రతి 17 గంటలకో బిలియనీర్ జత కలుస్తున్నారు. ఫోర్బ్స్ వరల్డ్ బిలియనీర్స్-2021 జాబితా ఈ సంగతిని వెల్లడిస్తున్నది.
తాజా బిలియనీర్ల జాబితాలో కొత్తగా 493 మంది జత కలిశారంటే కుబేరుల రికార్డులు ఎలా పెరుగుతున్నాయో అర్థం అవుతున్నది. ఇంతకుముందు 2015లో అత్యధికంగా 290 మంది కుబేరులు అవతరించారు. ఆ తర్వాత 2021 కుబేరుల జాబితా సరికొత్త రికార్డుగా నిలిచింది.
నూతనంగా బిలియనీర్లుగా అవతారమెత్తిన వ్యాపారవేత్తల ఆస్తి సగటున 200 కోట్ల డాలర్లుగా ఉందని ఫోర్బ్స్ నివేదిక పేర్కొంది. గతేడాదితో పోలిస్తే టాప్-10 బిలియనీర్ల ఆస్తిలో మూడింట రెండొంతులు పెరిగింది.
2021 టాప్ 10 బిలియనీర్ల ఆస్తి మొత్తం విలువ 1.15 లక్షల కోట్ల డాలర్లు. గతేడాది నమోదైన 686 బిలియన్ల డాలర్లతో పోలిస్తే మూడింట రెండొంతులు ఎక్కువ.
ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ ఆస్తి మొత్తం 177 బిలియన్ డాలర్లుగా ఉంది. దీంతో వరుసగా నాలుగో ఏడాది అతిపెద్ద కుబేరుడిగా జెఫ్ బెజోస్ నిలిచారు.
తర్వాతీ స్థానంలో ఎలక్ట్రిక్ వెహికల్ మేజర్ టెస్లా అండ్ స్పేస్ ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలన్ మస్క్, మూడో స్థానంలో ఫ్రాన్స్ బిలియనీర్ బెర్నార్డ్ అర్నాల్డ్, మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్ గేట్స్ నాలుగో స్థానంలో, ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్ బర్గ్ ఐదో స్థానంలో నిలిచారు.
భారతీయ బిలియనీర్.. రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ గతేడాది నుంచి 10వ స్థానంలో కొనసాగుతున్నారు. గతేడాదితో పోలిస్తే ఆయన ఆస్తిలో కొత్తగా 84 బిలియన్ల డాలర్లు జత కూడాయి.
ఆసియా-పసిఫిక్ దేశాల్లో 1,149 మంది బిలియనీర్ల ఆస్తి 4.7 లక్షల కోట్లు. ఇక అగ్రరాజ్యం అమెరికా కుబేరుల ఆస్తే 4.4 లక్షల కోట్లుగా ఉండటం గమనార్హం.
తాజాగా బిలియనీర్ల జాబితాలో అమెరికన్లు మొత్తం 724 మందితో మొదటి స్థానంలో ఉండగా, దానికి ప్రత్యర్థి చైనాలో 698 మంది బిలియనీర్లు తర్వాత స్థానం దక్కించుకున్నారు.
గతేడాది అమెరికాలో 614 మంది, చైనాలో 456 మంది బిలియనీర్లుగా అవతరించారు. కరోనా మహమ్మారికి పుట్టినిల్లైన చైనాలో కొత్తగా 205 మంది కుబేరులు అవతరించడం ఆసక్తి కర పరిణామం.
తదనుగుణంగా చైనాలో కొత్తగా సంపన్నులుగా అవతరించిన వారిలో స్మూర్ ఇంటర్నేషనల్ సీఈవో కం చైర్మన్ చెన్ జిపింగ్ సంపద 15.9 బిలియన్ల డాలర్లు, ఆర్ఎల్ఎక్స్ టెక్నాలజీ సీఈవో కేట్ వాంగ్ ఆస్తి 5 బిలియన్ల డాలర్లుగా నిలిచింది.
అమెరికాలో కొత్తగా 98 మంది బిలియనీర్లు అవతరించారు. వారిలో కిమ్ కర్దాషియన్ వెస్ట్, హాలీవుడ్ మొగుల్ టైలర్ పెర్రీ ఆస్తి 100 కోట్ల డాలర్లు కాగా, ఆపిల్ సీఈవో టిమ్ కుక్ సంపద 1.3 బిలియన్ల డాలర్లుగా నమోదైంది.
మూడో స్థానంలో జర్మనీ కుబేరులు ఉన్నారు. 26 మంది జర్మనీ వ్యాపారులు కొత్తగా కుబేరులుగా రూపాంతరం చెందితే, తర్వాత స్థానాల్లో కెనడా, భారత్‌లలో 19 మంది జత కలిశారు. ఈ ఏడాది 36 దేశాల్లో కొత్తగా ఒకరు కుబేరులుగా అవతరించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
మళ్లీ కొండెక్కుతున్న పసిడి ధరలు
కొవిడ్ రికవరీ రేటు మళ్లీ తగ్గిపోతోంది: కేంద్రం
మనిషిని పోలిన జీవికి మేక జన్మ.. దేవుడంటూ పూజలు
నిబంధనలు ఉల్లంఘిస్తే యమలోకానికే.. యముని వేషంలో కొవిడ్‌పై అవగాన..!
ఈ లక్షణం ఉంటే పుట్టేది ఆడపిల్లే
తెలంగాణలో కొత్తగా 2,478 కరోనా కేసులు
వేసవిలో మామిడిపండ్లు తినొచ్చా ?
‘పుష్ప’ షేర్స్ పై కన్నేసిన అల్లు అర్జున్..?
రఫేల్ డీల్‌తో దేశానికి రూ 21,000 కోట్ల నష్టం : కాంగ్రెస్
ప్రూఫ్స్ లేకుండానే ఆధార్‌లో అడ్రస్ మార్చడమెలా
పుష్ప’ షేర్స్ పై కన్నేసిన అల్లు అర్జున్..?
మీ ఆధార్‌ను ఎవరైనా వాడారా.. ఇలా తెలుసుకోండి
క్రెడిట్ కార్డు సైజ్‌లో ఆధార్.. అప్లై ఎలా చేయాలంటే..
ఆధార్ నంబర్ మర్చిపోయారా? ఇలా తెలుసుకోండి
పుట్టిన పిల్లలకు ఆధార్ కార్డు పొందడమెలా
తక్కువ సిబిల్ స్కోర్‌తోనూ పర్సనల్ లోన్.. అయితే!
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- billioneer
- corona
- Forbes
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

