ITR through SBI YONO | స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తన ఖాతాదారులకు తాజాగా మరో ఆఫర్ ఇచ్చింది. ఉచితంగా ఐటీ రిటర్న్స్ (ఐటీఆర్) దాఖలు చేయొచ్చునని గురువారం తెలిపింది. తమ యోనో యాప్‌పై ట్యాక్స్2విన్ ద్వారా ఎస్బీఐ కస్టమర్లు ఐటీఆర్ ఫైల్ చేయవచ్చు. ఈ ఆఫర్ ఈ నెల 31 వరకు అందుబాటులో ఉంటుందని వివరించింది.
కస్టమర్లు తొలుత ఎస్బీఐ యోనో యాప్‌లో లాగిన్ కావాలి.
తర్వాత యాప్‌లో షాప్స్ అండ్ ఆర్డర్స్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి.
తదుపరి ట్యాక్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ చూసుకుని దానిపై క్లిక్ చేయాలి.
అటుపై ట్యాక్స్2 విన్ ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకోవాలి.. ఆ తర్వాత ఐటీఆర్ ఫైల్ చేయొచ్చు.
ప్రభుత్వం అడిగిన సమాచారం ఇస్తూ ఇన్‌కం ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయవచ్చు.
పాన్ కార్డ్..
ఆధార్ కార్డ్..
ఫామ్-16..
ట్యాక్స్ డిడక్షన్ డిటైల్స్..
ఇంటరెస్ట్ ఇన్‌కం సర్టిఫికెట్స్
ఇన్వెస్ట్మెంట్ ఫ్రూఫ్స్ ఫర్ ట్యాక్స్ సేవింగ్స్
2020-21 ఆర్థిక సంవత్సరానికి ఐటీఆర్ ఫైల్ చేయడానికి తుది గడువు ఈ ఏడాది డిసెంబర్ 31. గడువు దాటిన తర్వాత ఐటీఆర్ ఫైల్ చేస్తే సంబంధిత పన్ను చెల్లింపు దారు ఆదాయాన్ని బట్టి ఫైన్ చెల్లించాల్సి వస్తుంది. రూ.5 లక్షల ఆదాయం వరకు పన్ను చెల్లిస్తున్నవారు లేట్ ఫైన్ రూపంలో రూ.1000 చెల్లించాలి.