Aadhar-Pan Link | ఒకవేళ మీరు ఇప్పటికీ మీ ఆధార్ కార్డును పాన్ కార్డుతో అనుసంధానం చేయలేదా.. అయితే, ఇప్పటికైనా ఆ పని పూర్తి చేయండి. ఈ నెలాఖరు వరకు ఆధార్-పాన్‌కార్డు అనుసంధానంపై రూ.500 ఫీజు చెల్లించాలి. ఈ నెల 30 దాటితే రూ.1000 ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకోసం ఆందోళన చెందాల్సిన అవసరమేమీ లేదు. ఆదాయం పన్నుశాఖ పోర్టల్‌లోకి వెళ్లి మీరే తేలిగ్గా ఆధార్ కార్డుతో పాన్ కార్డును లింక్ చేసేయొచ్చు. ఆధార్- పాన్ కార్డ్ లింకింగ్ ప్రాసెస్ దశల వారీగా ఎలాగో తెలుసుకుందాం.. !