Rs.2000 | క్లీన్ నోట్’ పాలసీలో భాగంగా రూ.2000 విలువైన నోటును ఉపసంహరించినట్లు భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) నిర్ణయించింది. 2016 నవంబర్ 8వ తేదీ అర్ధరాత్రి అర్ధంతరంగా పాత పెద్ద నోట్లు (రూ.1000, రూ.500) రద్దు చేసినట్లు ప్రధాని నరేంద్రమోదీ జాతినుద్దేశించి మాట్లాడుతూ చెప్పారు. ప్రజల అవసరాల కోసం 2016 నవంబర్ 10 నుంచే రూ.2000 నోటును ఆర్బీఐ చలామణిలోకి తెచ్చింది. కానీ, 2018లోనే రూ.2000 నోటు ముద్రణ నిలిపేశామని తాజాగా ఆర్బీఐ వెల్లడించింది. అయితే, 2017 మార్చి నాటికే 89 శాతం రూ.2000 నోట్ల ముద్రణ పూర్తయింది. ఏడేండ్ల క్రితం చలామణిలోకి వచ్చిన రూ.2000 నోటు.. ఆర్బీఐ చెప్పిన ప్రకారం రెండేండ్లకే ముద్రణ నిలిపేసింది. నాటి నుంచి ఐదేండ్ల లోపే రూ.2000 నోటుకు నూరేండ్లు నిండిపోయాయి.
ఇదిలా ఉంటే కొంత కాలంగా బ్యాంకుల్లో రూ.2000 నోట్లు చలామణీలో లేవు. 2016లో బ్లాక్ మనీని వెలికి తీసే లక్ష్యంతో పాత పెద్ద నోట్లు ఉపసంహరించి, రూ.2000 విలువైన నోటు తెచ్చామని కేంద్రం చెప్పింది. కానీ, బ్లాక్ మనీగా దాచి పెట్టుకోవడానికి రూ.2000 ఉపయుక్తంగా ఉందనే అభిప్రాయం వెల్లడైంది. ఆర్బీఐ వెల్లడించిన వివరాల ప్రకారం 2018 మార్చి నెలాఖరు నాటికి రూ.6.73 లక్షల కోట్లకు రూ.2000 నోట్ల చలామణి తగ్గిపోయింది. నాటి నుంచి 2023 మార్చి నెలాఖరు నాటికి రూ.3.62 లక్షల కోట్లకు పడిపోయింది. అంటే ప్రస్తుతం చలామణిలో 10.8 శాతం నోట్లు మాత్రమే ఉన్నాయని తెలుస్తున్నది.
ఈ నెల 23 నుంచి దేశంలోని అన్ని ప్రాంతీయ ఆర్బీఐ కార్యాలయాల్లో రూ.2000 నోట్లను బదిలీ చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నా.. వ్యాపార, వాణిజ్య రంగంలో రోజువారీ ఆర్థిక లావాదేవీలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉందన్న విమర్శలు ఉన్నాయి. రూ.2000 నోట్లతో ఆర్థిక లావాదేవీలు జరగవు. నాడు 2016లో పాత పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత వాటిని మార్చుకోవడానికి బ్యాంకుల వద్ద బారులు తీరిన పలువురు పౌరులు ఆందోళనతో ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఉన్నాయి. అయితే, ప్రస్తుతం డిజిటల్ లావాదేవీలు పెరిగిపోయినందున రోజువారీ లావాదేవీలపై ఎంత మేరకు ప్రభావం ఉంటుందని చూడాల్సి ఉందని ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు. 2013-14లోనూ ఇలా చలామణిలో ఉన్న నోట్లను ఉపసంహరించుకున్నామని ఆర్బీఐ వర్గాలు చెబుతున్నాయి.
RBI on Rs.2000| రూ.2000 నోటును ఉపంహరించుకున్న ఆర్బీఐ
Rs.2000 Note Circulation | తగ్గుతున్న రూ.2000 నోటు సర్క్యులేషన్.. వెల్లడించిన ఆర్బీఐ
2000 Note | 2000 నోటు ముద్రణ నిలిపేశాం.. స్పష్టం చేసిన కేంద్రం!
రూ.2000 నోటుకు ఆర్బీఐ రాంరాం!!