Home Loan EPF Rules | భారతీయుల్లో ప్రతి ఒక్కరికి సొంతింటి కల సాకారం చేసుకోవాలనే కోరిక ఉంటుంది. అందుకోసం వీలైన మేరకు పెట్టుబడి సేకరించడానికి ప్రయత్నిస్తుంటారు. వారు చేస్తున్న ఉద్యోగం.. బిజినెస్‌ను బట్టి ఇంటి కోసం బ్యాంకు రుణాలు తీసుకుంటే సొంతింటి కల సాకారం అవుతుంది. అలా రుణం తీసుకోవడానికి కొంత మొత్తం డౌన్‌పేమెంట్‌గా చెల్లించాల్సి ఉంటుంది. దీని కోసం కొందరు బంధుమిత్రుల సహకారం తీసుకుంటే.. మరికొందరు ఫ్రావిడెండ్ ఫండ్ నుంచి విత్ డ్రా చేసుకుంటారు. ఇల్లు కొనుగోలు చేయడానికి ఈపీఎఫ్ ఖాతా నుంచి డబ్బు విత్‌డ్రా చేసుకోవడానికి పర్మిషన్ ఉంది. అంతే కాదు.. తర్వాత ఇంటి రుణ వాయిదాలను చెల్లించడానికి కూడా ఈపీఎఫ్ ఖాతా నుంచి విత్‌డ్రా చేస్తారు.
ఇంటి లోన్ బకాయిలను చెల్లించడానికి ఈపీఎఫ్ మొత్తం వాడాలంటే కొన్ని షరతులు వర్తిస్తాయి. రాష్ట్ర ప్రభుత్వ రిజిస్టర్డ్ కోఆపరేటివ్ సొసైటీ, స్టేట్ హౌసింగ్ బోర్డు, జాతీయ బ్యాంకులు, ప్రభుత్వ ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకున్న వారికే ఈపీఎఫ్ ఖాతా నుంచి డబ్బు డ్రా చేసేందుకు అనుమతిస్తారు. 10 ఏండ్ల సర్వీసు ఉండాలి సుమా.. పీఎఫ్ ఖాతాలో 90 శాతం వరకు విత్ డ్రా చేసుకోవచ్చు.
ఇంటి రుణ బకాయిలు, డౌన్ పేమెంట్స్ చెల్లింపులకు ఈపీఎఫ్ వాడటంలో ప్రయోజనాలు ఉన్నాయి. భవిష్యత్‌లో ఆస్తి విలువ పెరుగుతుంది. కనుక ఈపీఎఫ్ ఖాతాలో డబ్బు ఉంచడానికి బదులు ఆస్తికోసం వినియోగించడం ప్రయోజనకరం. అదే సమయంలో కొందరు ఫిక్స్డ్ డిపాజిట్లు కూడా చేస్తుంటారు.. ఈపీఎఫ్ ఖాతాల్లో కంటే ఫిక్స్డ్ డిపాజిట్లలో తక్కువ వడ్డీ ఆదాయం లభిస్తే.. ఈపీఎఫ్ ఖాతా కంటే ఫిక్స్డ్ డిపాజిట్ డబ్బులనే వినియోగంలోకి తెచ్చుకోవాలి. ఇతర మదుపు పథకాల్లో మదుపు చేసిన మొత్తాన్ని.. ఇంటి రుణం డౌన్ పేమెంట్స్, బకాయిల చెల్లింపునకు వాడుకోవడం బెటర్.