డాటా అడ్డా హైదరాబాద్
డాటా లోకలైజేషన్‌తో దేశంలో డాటా సెంటర్ల ఏర్పాటు ఊపందుకుంటున్నది. అయితే ఈ డాటా సెంటర్ల ఏర్పాటుకు ఇప్పుడు హైదరాబాద్ చిరునామాగా నిలుస్తున్నది. తాజాగా గ్లోబల్ సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ రాష్ట్రంలో మరో మూడు డాటా సెంటర్లను రూ.16 వేల కోట్లతో ఏర్పాటు చేస్తామని ప్రకటించింది.
- అనువైన వాతావారణం.. అందిపుచ్చుకుంటున్న కంపెనీలు
- సెంటర్లు పెట్టేందుకుపోటీపడుతున్న బడా సంస్థలు
- వేల కోట్ల పెట్టుబడులు.. వేలాది ఉద్యోగాలకు అవకాశాలు
- రూ.16 వేల కోట్లతో మరో మూడింటిని ప్రకటించిన మైక్రోసాఫ్ట్
- డాటా సెంటర్ అంటేనే హైదరాబాద్.
- గ్లోబల్ ఐటీ కంపెనీలు అంటున్న మాట ఇదే. అందుకే వేల కోట్ల పెట్టుబడులతో వస్తున్నాయి.
- ఇక్కడి భౌగోళిక పరిస్థితులు.. మానవ వనరులు.. ప్రభుత్వ ప్రోత్సాహకాలు.. వెరసి డాటా అడ్డాగా హైదరాబాద్‌ను మార్చేశాయి.
హైదరాబాద్, జనవరి 19 (బిజినెస్ డెస్క్): డాటా లోకలైజేషన్‌తో దేశంలో డాటా సెంటర్ల ఏర్పాటు ఊపందుకుంటున్నది. అయితే ఈ డాటా సెంటర్ల ఏర్పాటుకు ఇప్పుడు హైదరాబాద్ చిరునామాగా నిలుస్తున్నది. తాజాగా గ్లోబల్ సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ రాష్ట్రంలో మరో మూడు డాటా సెంటర్లను రూ.16 వేల కోట్లతో ఏర్పాటు చేస్తామని ప్రకటించింది.
ఇప్పటికే గత ఏడాది రూ.16 వేల కోట్లతో మూడు డాటా సెంటర్లను తెస్తామని ఈ సంస్థ చెప్పిన విషయం తెలిసిందే. దీంతో తెలంగాణలో మైక్రోసాఫ్ట్ డాటా సెంటర్ల సంఖ్య 6కు చేరుతున్నాయి. అమెజాన్ వెబ్ సర్వీసెస్ వంటి అంతర్జాతీయ ప్రైవేట్ సంస్థలతోపాటు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వంటి ప్రభుత్వ రంగ సంస్థలూ హైదరాబాద్‌నే తమ స్మార్ట్ డాటా సెంటర్‌గా ఎంచుకుంటున్నాయంటే ఇక్కడి డిమాండ్‌ను అర్థం చేసుకోవచ్చు. కాగా, దేశంలో డాటా సెంటర్ పాలసీని తెచ్చిన తొలి రాష్ట్రం తెలంగాణనే. డాటా సెంటర్లను ప్రత్యేక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కేటగిరీలో పెట్టారు. భవన అనుమతులుసహా వీటి శైలి, నిర్మాణానికి సంబంధించి నిర్ధిష్ట ప్రమాణాలనూ రూపొందించారు.

Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cyber Crime | సైబర్ నేరాలకు కాంగ్రెస్ నేత మ్యూల్ ఖాతా!.. ప్రధాన నిందితుడు వెంకటేశ్ సహా నలుగురి అరెస్టు
YTPS | వైటీపీఎస్‌లో సీఈపై సస్పెన్షన్ వేటు.. రద్దు చేయాలని ఉద్యోగుల జేఏసీ వినతి
Congress | కాంగ్రెస్ నేత దౌర్జన్యం.. సంక్షేమ సంఘం కార్యదర్శిపై బూతుపురాణం
Smriti Mandhana | మంధాన శకంలో మొదటి అంకం.. నేడు జింబాబ్వేతో భారత్ తొలి టీ20
Jio Internet | జియోతో ఇంటర్నెట్ చౌక.. 6G సేవలపై ఎండీ ఆకాశ్ అంబానీ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

