Wipro- Walk in Interviews | వాక్ ఇన్ ఇంటర్వ్యూలకు పోటెత్తిన ఉద్యోగార్థులు.. కోల్‌కతా విప్రో క్యాంపస్ వీడియో వైరల్..!
Wipro- Walk in Interviews | ఏడాది కాలంగా కార్పొరేట్ సంస్థలన్నీ భారీగా లే-ఆఫ్స్ ప్రకటించాయి. దీంతో ఉద్యోగార్థులు ఎక్కడ ఇంటర్వ్యూలు ఉన్నా.. భారీగా తరలి వస్తున్నారు. తాజాగా విప్రో కోల్ కతా క్యాంపస్ లో నిర్వహించిన వాక్ ఇన్ ఇంటర్వ్యూలకు వేలాది మంది తరలి వచ్చారు.
Wipro- Walk in Interviews | ప్రపంచ మానవాళిని వణికించిన కరోనా మహమ్మారి ప్రభావం తర్వాత.. పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు.. ద్రవ్యోల్బణం ప్రభావంతో పొంచి ఉన్న ఆర్థిక మాంద్యం ముప్పుతో దాదాపు ఏడాది కాలంగా ఐటీ సంస్థలు మొదలు అన్ని కార్పొరేట్ సంస్థలు భారీగా లే-ఆఫ్స్ ప్రకటించాయి. దీంతో ఉద్యోగం కోసం వెతుకుతున్న టెక్కీలు.. ఇతర నిపుణులు ఏ సంస్థ ఉద్యోగాల నియామకాలకు నోటిఫికేషన్ ఇచ్చినా.. బారులు తీరుతున్నారు. అందుకు పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కతా నగర పరిధిలోని విప్రో నిర్వహించిన వాక్ ఇన్ ఇంటర్వ్యూలకు తరలి వచ్చిన ఉద్యోగార్థులే ఉదాహరణ. కోల్‌కతా విప్రో క్యాంపస్ బయట వేలాది మంది ఇంటర్వ్యూ కోసం వేచి చూస్తున్నారు. భారీగా నిరుద్యోగులు తరలి రావడంతో ఈ ఘటన సోషల్ మీడియాలో వైరలైంది.
‘ఈ వీడియోలో కనిపిస్తున్న వారంతా కోల్ కతాలోని విప్రో క్యాంపస్ లో నిర్వహిస్తున్న వాక్ ఇన్ ఇంటర్వ్యూలకు వచ్చిన వారే. తక్కువ ఉద్యోగాలకే విప్రో వాక్ఇన్ ఇంటర్వ్యూలను పిలిచినా దాదాపు 10 వేల మంది ఉద్యోగార్థులు తరలి వచ్చారు. ఇప్పుడు దేశంలో నెలకొన్న నిరుద్యోగ సమస్యకు సరైన ఉదాహరణ’ అంటూ ఓ నెటిజన్ ఎక్స్ లో వీడియో షేర్ చేశాడు. కొన్ని రోజులుగా దేశంలోని వివిధ నగరాల్లో వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నది.
ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు. దేశంలో జాబ్ మార్కెట్ ఎప్పుడూ ఒడిదొడుకులను ఎదుర్కొంటూనే ఉంటుందని ఓ యూజర్ కామెంట్ చేస్తే.. అమెరికాలో వడ్డీరేట్ల పెంపుతో ఆ దేశంతోపాటు భారత్‌లోని మరో నెటిజన్ రాసుకొచ్చాడు. ఎల్లవేళలా వాక్ఇన్ ఇంటర్వ్యూలు అంత తేలిక్కాదు’ అని మరో యూజర్ పేర్కొన్నాడు.
Outside Wipro's Kolkata office during walkin.
10000+ applicants for some jobs!
Job market isint that easy it seems. Your view? pic.twitter.com/BGm1TKfsOv— Abhishek Kar (@Abhishekkar_) August 8, 2023
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hanumakonda | అసమాన ప్రతిభతో ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు.. చిన్నారిని అభినందించిన స్కూల్ యాజమాన్యం..!
IND vs WI | చితక్కొట్టిన శాంసన్, తిలక్, అయ్యర్.. రాంచీలో విండీస్ ముందు కొండంత లక్ష్యం..!
Pregnancy | గర్భం కోసం ప్రయత్నిస్తున్న మహిళలు.. ఎప్పుడు ఫెర్టిలిటీ నిపుణులని కలవాలి..?
Students Appeal | ‘మాబడిలో హిందీ టీచర్ లేరు.. కలెక్టర్‌కు చెప్పి మూడు నెలలనైనా నియమించలే’..!
Newlywed Couple’s Bodies | కాళ్లకు గొలుసులతో.. నదిలో నూతన దంపతుల మృతదేహాలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

