క్లౌడ్ కంప్యూటింగ్‌పై విప్రో మోజు.. మూడేండ్లలో 100 కోట్ల డాలర్ల పెట్టుబడులు
క్లౌడ్ కంప్యూటింగ్‌పై విప్రో మోజు.. మూడేండ్లలో 100 కోట్ల డాలర్ల పెట్టుబడులు| ఐటీ రంగం అంతా క్లౌడ్ కంప్యూటింగ్ సేవలపైనే ఫోకస్ చేస్తున్నది. విప్రో ....

న్యూఢిల్లీ: ఇప్పుడు ఐటీ రంగం అంతా క్లౌడ్ కంప్యూటింగ్ సేవలపైనే ఫోకస్ చేస్తున్నది. ఐటీ దిగ్గజాలన్నీ క్లౌడ్ కంప్యూటింగ్ నిపుణుల సేవలకు ఫ్రాధాన్యం ఇస్తున్నాయి. అందులో భాగంగానే దేశీయ ఐటీ దిగ్గజ సంస్థల్లో ఒక్కటైన విప్రో.. తాజాగా విప్రో ఫుల్‌స్ట్రైడ్ క్లౌడ్ సర్వీసెస్‌ను ప్రారంభించింది. క్లౌడ్ టెక్నాలజీలో తమ శక్తి సామర్థ్యాలను బలోపేతం చేసుకోవడం, ఇతర సంస్థల స్వాధీనాలు, భాగస్వామ్య ఒప్పందాల కోసం వచ్చే మూడేండ్లలో 100 కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించింది.
సొంతంగా ఫుల్‌స్ట్రైడ్ క్లౌడ్ సర్వీసెస్ ప్రారంభం
వేగవంతంగా క్లౌడ్ సేవలను అందుబాటులోకి తేవడానికి విప్రో ఫుల్‌స్ట్రైడ్ క్లౌడ్ సర్వీసెస్.. పూర్తిస్థాయిలో విప్రోలో క్లౌడ్ అనుబంధ శక్తి సామర్థ్యాలను పెంపొందించేందుకు కట్టుబడి ఉంది. తద్వారా తమ క్లయింట్లకు మెరుగైన క్లౌడ్ సేవలందించేందుకు సిద్ధమైంది.
సొల్యూషన్స్‌తో సేవల వేగవంతం ఇలా
తాజా నిర్ణయంతో ఇప్పటికే విప్రోలో అందుబాటులో ఉన్నబిజినెస్తోపాటు క్లౌడ్ బిజినెస్‌ను విస్తృతపరిచేందుకు ఈ రంగంలో గణనీయ స్థాయిలో పెట్టుబడులను విస్తరించనున్నది. తన భాగస్వాములు, హైపర్ స్కేలర్లతో సొల్యూషన్స్ స్రుష్టించి మ్యూచువల్ క్లయింట్లకు సేవలు వేగవంతం చేయాలన్నది విప్రో యోచన.

ఐటీ ట్రాన్స్ఫర్మేషన్లో క్లౌడ్ అడాప్షన్ కీలకం
ఈనాడు ఏదేనీ ఐటీ ట్రాన్స్పర్మేషన్ ఇన్షియేటివ్‌లో క్లౌడ్ అడాప్షన్ కీలకం. క్లయింట్లను తమ వైపు తిప్పుకోవడానికి క్లౌడ్ సేవలు సాయ పడతాయి. క్లౌడ్ కంప్యూటింగ్‌లో 100 కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టడంతోపాటు విప్రో ఫుల్‌స్ట్రైడ్ క్లౌడ్ సర్వీసులను ప్రారంభించాం అని విప్రో సీఈవో కం మేనేజింగ్ డైరెక్టర్ థెర్రీ డెలాపోర్టె చెప్పారు. తమ క్లయింట్లకు క్లౌడ్ జర్నీ వేగవంతం చేయడానికి, సేవలను సరళతరం చేయడానికి తమ సంస్థ సమర్థవంతమైన స్థానంలో నిలుస్తుందన్నారు.
క్లౌడ్ కంప్యూటింగ్‌లో 89 వేల మందికి కొలువులు
క్లౌడ్ బిజినెస్‌లో విప్రో నిరంతరం గ్రోత్ కనబరుస్తున్నది. ప్రస్తుతం విప్రోలో 79 వేల మందికి పైగా క్లౌడ్ ప్రొఫెషనల్స్, లీడింగ్ క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్లు సర్టిఫై చేసిన 10 వేల మందికి పైగా సేవలందిస్తున్నారు. గత ఏడాది కాలంలో టెలిఫోనికా కంపెనీ/ ఓ2, వెరిఫోన్, ఈ.ఆన్, మెట్రో ఏజీ డీల్స్‌ను గెలుచుకున్నది విప్రో.
ఈ వార్తలు కూడా చదవండి:
ఇంట్లో ఫోన్ మర్చిపోయారా..? డోంట్‌వర్రీ కారు ఉందిగా..!
మొబైల్ స్క్రీన్ పగిలిపోయిందా? ఇక దానికదే అతుక్కుంటుంది.. అదెలాగంటే
రైతుల నుంచి 3000 కోట్లు వెనక్కి తీసుకుంటున్నాం..
పుష్పలో కీలక పాత్ర..యాక్టర్ కమ్ డైరెక్టర్ క్లారిటీ
స్టార్టప్ కంపెనీని కొనుగోలు చేసిన యుట్యూబ్…
భారీగా పతనమైన అదానీ షేర్స్…కారణం ఇదే..!
ఐటీ కొలువుల మేళా : 1.5 లక్షల మంది ఫ్రెషర్స్ నియామకానికి టెక్ దిగ్గజాలు రెడీ!
వేదంతాకు షాక్.. వీడియోకాన్ టేకోవర్‌పై ఎన్సీఎల్ఏటీ స్టే..
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

