మొబైల్ స్క్రీన్ పగిలిపోయిందా? ఇక దానికదే అతుక్కుంటుంది.. అదెలాగంటే
స్మార్ట్ ఫోన్ స్క్రీన్ మొత్తం పగిలిపోయింది. మళ్లీ వాడటానికి వీలులేకుండా దెబ్బతిన్నది. తీసి పరిశీలించేలోగా నేలపై ఉన్న ఫోన్లో కదలిక మొదలైంది. క్షణాల్లోనే స్క్రీన్‌పై పగుళ్లు మాయం అయ్యాయి.
చేతిలో స్మార్ట్ ఫోన్ జారి కింద పడింది. స్క్రీన్ మొత్తం పగిలిపోయింది. మళ్లీ వాడటానికి వీలులేకుండా దెబ్బతిన్నది. తీసి పరిశీలించేలోగా నేలపై ఉన్న ఫోన్లో కదలిక మొదలైంది. క్షణాల్లోనే స్క్రీన్‌పై పగుళ్లు మాయం అయ్యాయి. కన్నుమూసి తెరిచేంతలో పగిలిన ఫోన్ మళ్లీ పూర్వస్థితికి చేరింది. ఇలాంటివి ఇప్పటివరకు సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో చూశాం. భవిష్యత్తులో నిజంగానే చూడబోతున్నాం. దీనికి ‘సెల్ఫ్ హీలింగ్’ లోహాలు సాయపడనున్నాయి.


‘సెల్ఫ్ హీలింగ్’ లోహాలు అంటే?
ఎలక్ట్రానిక్ పరికరాలు స్వయంగా రిపేర్(సెల్ఫ్ హీలింగ్) చేసుకోవడానికి వీలు కల్పించే లోహాలను కోల్‌కతాలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్(ఐఐఎస్ఈఆర్), ఐఐటీ ఖరగ్‌పూర్ శాస్త్రవేత్తలు తయారు చేశారు. 2015లో కేంద్రప్రభుత్వం నుంచి ప్రఖ్యాత స్వర్ణజయంతి ఫెలోషిప్ పొందిన ప్రొఫెసర్ మల్లారెడ్డి, ఆయన బృందం ఐఐఎస్ఈఆర్లో ఈ లోహాలను కృత్రిమంగా తయారు చేసింది. శరీరంలో ఏదైనా భాగం దెబ్బతిన్నప్పుడు గాయం చుట్టు ఉన్న కణాలు ఎలాగైతే కణజాలాలను ఉత్పత్తి చేసి గాయాన్ని పూడుస్తాయో అలాగే ఈ ‘సెల్ఫ్ హీలింగ్’ లోహాలు పనిచేస్తాయని శాస్త్రవేత్తలు చెప్పారు. ఫోన్లు, టీవీ స్క్రీన్లు ఇలా చాలా వాటి తయారీలో ఈ లోహాలు కీలక పాత్ర పోషించబోతున్నట్టు చెప్పారు.

చార్జింగ్ ఆధారంగానే..
ఇంతకుముందు కూడా ఇలాంటి ‘సెల్ఫ్ హీలింగ్’ లోహాలను తయారు చేసినట్టు శాస్త్రవేత్తలు చెప్పారు. ఏరోస్పేస్, ఇంజినీరింగ్, ఆటోమేషన్‌లో వినియోగించినట్టు పేర్కొన్నారు. అయితే కొత్తగా తయారు చేసిన లోహాలకు, వీటికి చాలా తేడా ఉందని తెలిపారు. పాత వాటి కంటే ఇవి 10 రెట్లు దృఢమైనవని పేర్కొన్నారు. అవి సెల్ఫ్ హీల్ కావాలంటే కాంతి, వేడి, ఏదో ఒక రసాయనం అవసరం పడేదని పేర్కొన్నారు. తాజా లోహాలు ఎలక్ట్రానిక్ పరికరాల్లోని చార్జింగ్ ఆధారంగానే బాగవుతాయని చెప్పారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
గూగుల్‌లో వీటిని అసలు సెర్చ్ చేయకూడదు!
3జీ, 4జీ, 5జీ తెలుసు.. మరి ‘జీరో’ జీ ఉందని తెలుసా !
త్వరలో మార్కెట్ లోకి…వన్‌ప్లస్ నార్డ్-2
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

