న్యూఢిల్లీ, జూలై 19: ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్ఐసీ.. సోమవారం ‘ఆరోగ్య రక్షక్’ పాలసీని ప్రారంభించింది. ఇది నాన్-లింక్డ్, నాన్-పార్టిసిపేటింగ్, రెగ్యులర్ ప్రీమియం, వ్యక్తిగత, హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్. పూర్తిస్థాయి కుటుంబ రక్షణే లక్ష్యంగా దీన్ని ఎల్ఐసీ పరిచయం చేసింది. 18 ఏండ్ల నుంచి 65 ఏండ్ల పెద్దలు, 91 రోజుల నుంచి 20 ఏండ్లలోపున్న పిల్లలు ఈ బీమా పాలసీలో భాగం కావచ్చు. పాలసీదారు, వారి భాగస్వామి, తల్లిదండ్రులకు 80 ఏండ్లదాకా.. పిల్లలకైతే 25 ఏండ్లదాకా బీమా ప్రయోజనాలు వర్తిస్తాయి.