రైతుల నుంచి 3000 కోట్లు వెనక్కి తీసుకుంటున్నాం..

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం రైతులకు పీఎం కిసాన్ స్కీమ్ కింద నగదు ట్రాన్స్ఫర్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే 42 లక్షల మంది అనర్హ రైతులకు కూడా ఆ స్కీమ్ ప్రకారం సుమారు మూడు వేల కోట్లు బదిలీ చేశారు. ఆ అమౌంట్‌ను మళ్లీ వసూల్ చేస్తున్నట్లు ఇవాళ పార్లమెంట్లో వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. పీఎం కిసాన్ స్కీమ్ కింద కేంద్రం ప్రతి రైతుకు ఆరు వేలు ఇస్తున్నది. మూడు ఇన్స్టాల్మెంట్లలో ఆ అమౌంట్ ఇస్తున్నారు. అయితే ఆదాయ పన్ను కట్టే రైతులకు ఆ స్కీమ్ వర్తించదు. కానీ కొందరు రైతులకు నగదు ట్రాన్స్ఫర్ అయ్యింది. వారి నుంచి సుమారు 2992 కోట్లు రికవర్ చేయాల్సి ఉందని మంత్రి తెలిపారు. అస్సాంలో 8.35 లక్షల మంది రైతుల నుంచి 554 కోట్లు వసూల్ చేయాల్సి ఉందన్నారు. పంజాబ్ నుంచి 437 కోట్లు, మహారాష్ట్ర నుంచి 358 కోట్లు, తమిళనాడు నుంచి 340 కోట్లు, యూపీ నుంచి 258 కోట్లు, గుజరాత్ నుంచి 220 కోట్లు వసూల్ చేయాలన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gautham Ghattamaneni | ‘రామాయణ’ సినిమాకు రివ్యూ ఇచ్చిన గౌతమ్ ఘట్టమనేని.. రేటింగ్ ఎంతంటే?
విద్యతోనే సమాజాభివృద్ధి సాధ్యం : కలెక్టర్ రాహుల్ శర్మ
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ఎన్హెచ్ఎంల నిరసన సెగ.. వీడియో
Lizards | ఇంట్లో బల్లులు ఇరిటేట్ చేస్తున్నాయా.. ఈ టిప్స్‌తో ప్రాబ్లమ్ పరార్..!
Running | 40 ఏళ్ల వయస్సులో రోజూ రన్నింగ్ చేయవచ్చా.. నిపుణులు ఏం చెబుతున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

