న్యూఢిల్లీ, ఏప్రిల్ 16: విప్రో నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. మార్చితో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.3,501.8 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. కంపెనీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 7.6 శాతం ఎగబాకి రూ.24,236.3 కోట్లకు చేరుకున్నది. గడిచిన ఆర్థిక సంవత్సరం మొత్తానికి రూ.92,624 కోట్ల ఆదాయంపై రూ.13,197.4 కోట్ల నికర లాభాన్ని గడించింది.
మరోవైపు, ఆర్థిక ఫలితాల విడుదల సందర్భంగా గురువారం కంపెనీ బోర్డు సమావేశమై రూ.15 వేల కోట్ల విలువైన షేర్లను తిరిగి కొనుగోలు ప్రక్రియకు ఆమోదం తెలిపింది. కంపెనీ చరిత్రలో ఇంతటి స్థాయిలో షేర్లను బైబ్యాక్ చేయడం ఇదే తొలిసారి.