Gold Price | బంగారం ధరకు రెక్కలు.. మూడు నెలల్లో ఎంత పెరిగిందంటే?!
Gold Price | డాలర్ ఇండెక్స్ బలహీన పడటంతోపాటు పెండ్లిండ్ల సీజన్ కావడంతో బంగారం ధరకు రెక్కలొచ్చాయి. హైదరాబాద్ లో రూ.57వేల మార్క్ దాటేసింది.
Gold Price | డాలర్ ఇండెక్స్ బలహీన పడటం, అంతర్జాతీయంగా ధరలకు అనుగుణంగా దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం ధర ధగధగ మెరిసిపోతున్నది. దీనికి తోడు ఈ నెల 25 నుంచి పెండ్లిండ్ల సీజన్ ప్రారంభం కానుండటంతో పుత్తడి ధరకు రెక్కలొచ్చాయి. ఆదివారం హైదరాబాద్ మార్కెట్లో పది గ్రాముల (24 క్యారట్ల) బంగారం ధర రూ.57 వేల మార్క్ దాటి రూ.57,060 వద్దకు చేరుకున్నది. ఆభరణాల తయారీలో ఉపయోగించే 22 క్యారట్ల తులం బంగారం ధర రూ.52,250 వద్ద నమోదైంది.
కిలో వెండి ధర రూ.74 వేలకు పైనే
ఇక కిలో వెండి ధర రూ.74,300 పలుకుతున్నది. గత నవంబర్ నుంచి అమెరికా డాలర్, యూఎస్ ట్రెజరీ బాండ్ల విలువ తగ్గుముఖం పట్టడంతో ఇన్వెస్టర్లు ప్రత్యామ్నాయంగా బంగారంపై పెట్టుబడి పెడుతున్నారు. దీంతో మూడు నెలల్లోనే 10 గ్రాముల బంగారం ధర దాదాపు రూ.6000 పెరిగింది.
వచ్చే వారం నుంచి పెండ్లిండ్ల సీజన్ షురూ..
వచ్చేవారం నుంచి పెండ్లిండ్ల సీజన్ మొదలు కానున్నది. పెండ్లిండ్లకు వధువుకు బంగారం కొనుగోలు తప్పనిసరి. పేద, మధ్య తరగతి కుటుంబాలైనా మినిమం నాలుగైదు తులాల బంగారం కొనాల్సిందే. ప్రస్తుత ధర వరల ప్రకారం దీనికే దాదాపు రూ.3 లక్షల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇలా బంగారం ధర ఆకాశాన్నంటేలా దూసుకెళ్తే తమకు పెనుభారంగా మారుతుందని మధ్య తరగతి కుటుంబాలు చెబుతున్నాయి.
ఏపీలోని ప్రధాన నగరాల్లో ఇలా
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాలు విజయవాడ, విశాఖపట్నంలలో తులం బంగారం ధర రూ.58,770 పలుకుతున్నది. ఆభరణాల తయారీలో ఉపయోగించే 22 క్యారట్ల బంగారం తులం ధర రూ.54,040 వద్ద నిలిచింది. బంగారం ఆభరణాల తయారీలో తరుగు, మజూరీ పేరిట 10-23 శాతం కొనుగోలు దారుడి నుంచి అదనంగా వసూలు చేస్తారు. వీటితోపాటు జీఎస్టీ కూడా అదనం.
దేశంలోని వివిధ ప్రాంతాల్లో బంగారం ధర వరలు ఇలా:
ఢిల్లీ:
22 క్యారట్లు : రూ. 52,400
24 క్యారట్లు : రూ. 57,210
చెన్నై:
22 క్యారట్లు – రూ.53,200
24 క్యారట్లు – రూ. 58,040
ముంబై:
22 క్యారట్లు – రూ.52,250
24 క్యారట్లు – రూ.57,060
కోల్‌కతా:
22 క్యారట్లు – రూ. 52,250
24 క్యారట్లు – రూ. 57,060
బెంగళూరు:
22 క్యారట్లు – రూ. 52,300
24 క్యారట్లు – రూ. 57,110
హైదరాబాద్:
22 క్యారట్లు – రూ.52,250
24 క్యారట్లు – రూ. 57,060
పుణె:
22 క్యారట్లు – రూ. 52,250
24 క్యారట్లు – రూ.57,060
అహ్మదాబాద్:
22 క్యారట్లు – రూ. 52,300
24 క్యారట్లు – రూ.57,110
లక్నో:
22 క్యారట్లు – రూ.52,400
24క్యారట్లు – రూ.57,210
చండీగఢ్:
22 క్యారట్లు – రూ.52,400
24 క్యారట్లు – రూ. 57,210
సూరత్:
22 క్యారట్లు – రూ.52,300
24 క్యారట్లు – రూ.57,110
భువనేశ్వర్:
22 క్యారట్లు – రూ.52,250
24 క్యారట్లు – రూ. 57,060
గుర్గావ్:
22 క్యారట్లు – రూ.52,400
24 క్యారట్లు – రూ. 57,210
దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరవరలు ఇలా
చెన్నై :
కిలో – రూ. 74,300
ముంబై:
కిలో – రూ. 72,300
ఢిల్లీ:
కిలో – రూ.72,300
కోల్‌కతా:
కిలో – రూ. 72,300
బెంగళూర్:
కిలో- రూ. 74,300
హైదరాబాద్:
కిలో – రూ.74,300
పుణె:
కిలో- రూ. 72,300
అహ్మదాబాద్:
కిలో – రూ.72,300
లక్నో:
కిలో- రూ.72,300
ఛండీగఢ్:
కిలో- రూ. 72,300
సూరత్:
కిలో – రూ. 72,300
భువనేశ్వర్:
కిలో – రూ. 74,300
గుర్గావ్:
కిలో – రూ. 72,300
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Suicide | పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య
NHM Employees | ఉరి తాళ్లతో ఎన్హెచ్ఎం ఉద్యోగుల నిరసన
Ambarkishore jha | బాధితులకు న్యాయం చేయడమే పోలీసుల లక్ష్యం: రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా
Chandrababu | బ్లాక్మెయిల్ రాజకీయాలు మానుకుంటే మంచిది.. వైసీపీకి చంద్రబాబు హెచ్చరిక
విశ్వామిత్ర చౌహాన్ సేవలు అభినందనీయం : అదనపు కలెక్టర్ వేణుగోపాల్
ట్రెండింగ్ వార్తలు
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం

