Shabbir Ali: భారత ఫుట్‌బాల్ జట్టు మాజీ కెప్టెన్‌పై తెలంగాణ ఫుట్‌బాల్ సంఘం సస్పెన్షన్
Shabbir Ali: భారత ఫుట్‌బాల్ జట్టు మాజీ కెప్టెన్, ధ్యాన్‌చంద్ అవార్డు గ్రహీత షబ్బీర్ అలీపై తెలంగాణ ఫుట్‌బాల్ అసోసియేషన్ సస్పెన్షన్ విధించింది. అబ్బాస్ యూనియన్ ఫుట్‌బాల్ క్లబ్ ప్రెసిడెంట్ హోదాలో షబ్బీర్ అలీ అనైతిక చర్యలకు పాల్పడినట్లు తేలింది. కోచింగ్ ఇవ్వడానికి ఏఎఫ్సీ బీ లైసెన్స్ సర్టిఫికేట్ లేకున్నా..ఉన్నట్లు చెప్పి క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడ్డాడు.
హైదరాబాద్: భారత ఫుట్‌బాల్ జట్టు మాజీ కెప్టెన్, ధ్యాన్‌చంద్ అవార్డు గ్రహీత షబ్బీర్ అలీ(Shabbir Ali)పై తెలంగాణ ఫుట్‌బాల్ అసోసియేషన్ సస్పెన్షన్ విధించింది. అబ్బాస్ యూనియన్ ఫుట్‌బాల్ క్లబ్ ప్రెసిడెంట్ హోదాలో షబ్బీర్ అలీ అనైతిక చర్యలకు పాల్పడినట్లు తేలింది. ఏడాది పాటు అతనిపై వేటు వేశారు. అబ్బాస్ ఫుట్‌బాల్ క్లబ్ ప్రెసిడెంట్ హోదాలో షబ్బీర్ క్రమశిక్షణ ఉల్లంఘనలకు పాల్పడ్డారు. టీఎఫ్ఏ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్, టెక్నికల్ కమిటీ మీటింగ్, జనరల్ బాడీ మీటింగ్‌లో షబ్బీర్‌పై చర్యలు తీసుకున్నట్లు తెలంగాణ ఫుట్‌బాల్ అసోసియేషన్ సెక్రటరీ జీ ఫాల్గుణ తెలిపారు.
సంతోష్ ట్రోఫ్ కోసం తెలంగాణ జట్టుకు కోచ్‌గా షబ్బీర్‌ను నియమించారు. అయితే ఆ నియామక సమయంలో ఏఐఎఫ్ఎఫ్ మార్గదర్శకాల ప్రకారం తన వద్ద ఏఎఫ్సీ బీ లైసెన్స్ సర్టిఫికేట్ ఉన్నట్లు ఆయన చెప్పారు. ఆ సమాచారం ఆధారంగానే షబ్బీర్‌ను కోచ్‌గా నియమించినట్లు టీఎఫ్ఏ పేర్కొన్నది. కానీ బెంగుళూరులో సంతోష్ ట్రోఫీ జరుగుతున్న సమయంలో షబ్బీర్‌ను కోచ్‌గా ఏఐఎఫ్ఎఫ్ అంగీకరించలేదు. ఏఎఫ్సీ బీ లైసెన్సు సర్టిఫికేట్ అతని వద్ద లేదని గ్రహించామని ఫాల్గుణ తెలిపారు.
షబ్బీర్ క్రమశిక్షణా ఉల్లంఘనకు పాల్పడినట్లు తేలింది. షబ్బీర్‌కు కోచింగ్ సామర్థ్యం లేదని ఆరోపణలు రావడంతో తెలంగాణ ఫుట్‌బాల్ సంఘం ఆయన్ను సస్పెండ్ చేసింది. రూల్స్‌కు వ్యతిరేకంగా పలు క్రీడా సమావేశాలకు కూడా షబ్బీర్ హాజరైనట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shabbir Ali: భారత ఫుట్‌బాల్ జట్టు మాజీ కెప్టెన్‌పై తెలంగాణ ఫుట్‌బాల్ సంఘం సస్పెన్షన్
Roshan Kanakala | మరో డిఫరెంట్ జానర్‌తో రాబోతున్న రోషన్ కనకాల.. ఈసారి వీఐ ఆనంద్ కథతో కొత్త ప్రయోగం!
Upasana | దీపావళి వేడుకల్లో స్టార్ హీరోల భార్యల సందడి.. ఒకే ఫ్రేమ్‌లో ఉపాసన, స్నేహారెడ్డి, నమ్రత.. ఫొటోలు వైరల్!
Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో దీపావళి విషాదం.. 2 ప్రమాదాల్లో 12 మంది మృతి.. రెండు కుటుంబాలు బుగ్గి
Uttar Pradesh | యూపీలో మంటల్లో చిక్కుకున్న కారు.. చిన్నారి సహా ఆరుగురు సజీవదహనం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

