Reliance-Disney | ఇక రిలయన్స్‌లో డిస్నీ ఇండియా మెర్జర్ అనివార్యమా..?!
Reliance-Disney | రిలయన్స్, వాల్ డిస్నీ సారధ్యంలోని డిస్నీ ఇండియా సంస్థల విలీనంపై రెండు సంస్థల మధ్య చర్చలు ఓ కొలిక్కి వచ్చాయని తెలుస్తున్నది. వచ్చేనెలలో రెండు సంస్థల విలీనం పూర్తవుతుందని సమాచారం.
Reliance-Disney | రిలయన్స్ ఇండస్ట్రీస్, వాల్ డిస్నీ విలీనం చర్చలు దాదాపు పూర్తి కావచ్చాయి. దేశీయంగా మీడియా, ఎంటర్టైన్మెంట్ సేవలందిస్తున్న రిలయన్స్ అనుబంధ వయాకాం, వాల్ట్ డిస్నీ అనుబంధ డిస్నీ ఇండియా విలీనం త్వరలో పూర్తి కానున్నది. విలీనం పూర్తయిన తర్వాత ఏర్పడే సంస్థలో ముకేశ్ అంబానీ సారధ్యంలోని రిలయన్స్‌కు 51 శాతం, డిస్నీ ఇండియాకు 49 శాతం ఉంటుందని ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ఓ వార్తా కథనం ప్రచురించింది. రిలయన్స్ అనుబంధ వయాకాం 18 అనుబంధ సంస్థగా సదరు విలీన సంస్థ ఉంటుందని తెలుస్తున్నది.
యాజమాన్య వాటా కింద డిస్నీ ఇండియాకు రిలయన్స్ కొంత నగదు చెల్లించనున్నదని సమాచారం. విలీన సంస్థ బోర్డులో రెండు సంస్థలకు సమాన వాటా ఉంటుందని భావిస్తున్నాయి. ఇక వయాకాం 18లో అతి పెద్ద ఇన్వెస్టర్ ‘బోధి ట్రీ’కి కూడా బోర్డులో చోటు దక్కుతుందని తెలుస్తోంది. వచ్చే నెలాఖరు నాటికి విలీన ప్రక్రియ ఓ కొలిక్కి రానున్నదని వార్తలు వినిపిస్తున్నాయి.
దేశంలో ప్రస్తుతం స్టార్ ఇండియా సంస్థ 77 చానెళ్లు నడుపుతుండగా, వయాకాం 18.. 38 చానెళ్లు నిర్వహిస్తున్నది. డిస్నీకి డిస్నీ+ హాట్ స్టార్, రిలయన్స్‌కు జియో సినిమా స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ ఉన్నాయి. అయితే విలీనంపై ఇరు సంస్థల నుంచి ఎటువంటి ప్రకటన రాలేదు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eedupayala | ఏడుపాయలలో వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
Hasan Mahmud | టెస్టుల్లో తొలి హ్యాట్రిక్.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ పేసర్..!
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
Ranabaali | విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ‘రణబాలి’ డబ్బింగ్ వెర్షన్స్ విడుదల వాయిదా!
Riyadh airport | రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడిని తీవ్రంగా ఖండించిన భారత్..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

