ద్రవ్యోల్బణాన్ని దించుతాం: శక్తికాంత్ దాస్
అంతర్జాతీయ మందగమనం నడుమ దేశీ ఆర్థికాభివృద్ధిని సంరక్షిస్తూనే ద్రవ్యోల్బణానికి కళ్లెం వేయడం తమ ప్రధాన లక్ష్యమని రిజర్వ్‌బ్యాంక్ గవర్నర్
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 2: అంతర్జాతీయ మందగమనం నడుమ దేశీ ఆర్థికాభివృద్ధిని సంరక్షిస్తూనే ద్రవ్యోల్బణానికి కళ్లెం వేయడం తమ ప్రధాన లక్ష్యమని రిజర్వ్‌బ్యాంక్ గవర్నర్ శక్తికాంత్ దాస్ చెప్పారు. ‘ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగిస్తున్న సంకేతాల్ని మనం చూస్తున్నాం.
ఈ ప్రభావం భారత్‌పై తక్కువగా ఉండేలా మేము చూస్తాం’ అని దాస్ వ్యాఖ్యానించారు. జూన్ త్రైమాసికంలో జీడీపీ వృద్ధి ఆర్బీ ఐ అంచనా 16.2 శాతానికంటే తక్కువగా వెలువడిన నేపథ్యంలో దాస్ ఒక ఆంగ్లచానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘జీడీపీ డాటాను విశ్లేషించి, వచ్చే పాలసీ ప్రకటనలో తగిన చర్యలు తీసుకుంటాం‘ అన్నారు. ద్రవ్యోల్బణం ఇప్పటికే గరిష్ఠస్థాయిని చూసిందని, వచ్చే ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో ఇది 5 శాతానికి దిగివస్తుందని అంచనా వేస్తున్నట్టు ఆర్బీఐ గవర్నర్ తెలిపారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వడ్డీ రేట్ల పెంపుదలలో ఆర్బీఐ వెనుకబడి లేదన్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
Yash | సర్దార్ డైరెక్టర్‌తో యశ్ సినిమా.. క్రేజీ టాక్ నిజమయ్యేనా..?
Ollie Robinson | పాకిస్థాన్‌పై నిప్పులు.. మూడేళ్లకు మళ్లీ సెంట్రల్ కాంట్రాక్ట్..!
Fake CISF DSP | ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగాలు, చౌకగా ఐఫోన్లు ఇప్పిస్తానంటూ మోసం.. నకిలీ సీఐఎస్ఎఫ్ డీఎస్పీ అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

