Cognizant | గ్లోబల్ టెక్ దిగ్గజం కాగ్నిజెంట్ (Cognizant) తీసుకున్న నిర్ణయం విమర్శలకు దారి తీస్తోంది. ఆఫ్-లైన్ క్యాంపస్ ప్లేస్ మెంట్స్‌లో ఎంట్రీ లెవల్ ఉద్యోగాలకు ఎంపికైన ఫ్రెష్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లకు వార్షిక వేతన ప్యాకేజీ రూ.2.5 లక్షలుగా నిర్ణయించడమే దీనికి కారణం. భారత్ లోని ఐటీ దిగ్గజాల్లో ఒకటిగానూ అంతర్జాతీయ ఐటీ రంగంలోనూ ప్రధాన సంస్థగా ఉన్నదీ కాగ్నిజెంట్ (Cognizant). 2002 నుంచి ఇదే వేతన ప్యాకేజీ అమలు చేస్తున్నా, ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లోనూ ఇదే ప్యాకేజీ ప్రకటించడం విమర్శలకు కారణం అవుతోంది. నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా దుమ్మెత్తి పోస్తున్నారు.
అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక మాంద్యం నేపథ్యంలో ఉద్యోగాల నియామకంపై ఆంక్షలు, పని చేస్తున్న ఉద్యోగులకు లేఆఫ్స్తోపాటు టెక్నాలజీ ఆపరేషన్స్‌ను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వైపు మళ్లించడం పెరుగుతున్న నేపథ్యంలో వేతన ప్యాకేజీలో మార్పులు చేయకపోవడంపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. పరిమిత ఉద్యోగ అవకాశాలతో ఒత్తిడికి గురవుతున్న ఫ్రెష్ గ్రాడ్యుయేట్లు కాగ్నిజెంట్ తీరుపై సోషల్ మీడియా వేదికలపై తమ ఫ్రస్టేషన్, హ్యూమర్ షేర్ చేస్తున్నారు. జీవన వ్యయానికి, వేతన ఆఫర్లకు మధ్య తేడాలను గుర్తు చేస్తున్నారు. ప్రధానంగా మెట్రో నగరాల పరిధిలో తక్కువ వేతన ప్యాకేజీలతో జీవనం సాగించడం కష్ట సాధ్యం అని పెదవి విరుస్తున్నారు.
2.52 LPA offered by Cognizant. That’s around 20k per month salary.
Just for the reference, A maid who works for 30min in a house, works in 8-10 such houses get more salary than an Engineer. https://t.co/hzgZKIWjrU
— EngiNerd. (@mainbhiengineer) August 13, 2024
Maruti Suzuki Ertiga | ఎంపీవీ కార్లకు గిరాకీ.. మారుతి సుజుకి ఎర్టిగా యమ పాపులర్..!
BSA Gold Star 650 | 15న భారత్ మార్కెట్లో బీఎస్ఏ గోల్డ్ స్టార్ 650 బైక్ లాంచింగ్.. ఇవీ డీటెయిల్స్..!
Realme C63 5G | 32-ఎంపీ ఏఐ ఫీచర్లతో రియల్మీ నుంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్.. ఇవీ డీటెయిల్స్..!