న్యూఢిల్లీ, సెప్టెంబర్ 17: టోకు ధరల సూచీ శాంతించింది. వరుసగా రెండో నెల ఆగస్టులోనూ టోకు ధరల సూచీ నాలుగు నెలల కనిష్ఠ స్థాయి 1.31 శాతానికి పడిపోయింది. కూరగాయలు, ఆహార, చమురు ధరలు తగ్గుముఖం పట్టడం వల్లనే ధరల సూచీ తగ్గిందని కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది.
జూలై నెలలో 2.04 శాతంగా ఉన్న ధరల సూచీ..ఏడాది క్రితం మైనస్ 0.46 శాతంగా ఉన్నది. ఆహారపదార్థాల ధరల సూచీ 3.11 శాతంగా ఉన్నది.