Forbes list | ఫోర్బ్స్ జాబితా-2022.. ఈ ఏడాది భారత్‌లోని 10 మంది సంపన్నులు వీళ్లే
ఈ పది మంది సంపాదన 350 బిలియన్ డాలర్లు ఉంటుందని ఫోర్బ్స్ తెలిపింది.
Forbes list : అమెరికాకు చెందిన ఫోర్బ్స్ మ్యాగజైన్ భారతదేశంలోని వంద మంది సంపన్నుల జాబితా-2022ను విడుదల చేసింది. ఈ వంద మంది సంపాదన 800 బిలియన్ డాలర్లు అని ఫోర్బ్స్ వెల్లడించింది. ఈ ఏడాదిలో స్టాక్ మార్కెట్ పతనంతో పాటు రూపాయి విలువ 10 శాతం పడిపోయినప్పటికీ వీళ్ల సంపాదన పెరగడం గమనార్హం. ఈ లిస్ట్‌లో టాప్ 10లో ఎవరెవరు ఉన్నారంటే.. అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ ఆదానీ 150 బిలియన్ డాలర్ల (రూ. 1,211,460.11 కోట్లు) ఆదాయంతో మొదటి స్థానంలో నిలిచాడు. 88 బిలియన్ డాలర్ల (రూ.710,723.26 కోట్లు)తో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ రెండో స్థానం సొంతం చేసుకున్నాడు.
డీమార్ట్ రిటైల్ సూపర్‌మార్కెట్ డీమార్ట్ యజమాని రాధాకిషన్ దమనీ రూ. 222,908.66 కోట్ల సంపాదనతో మూడోస్థానంలో ఉన్నాడు. సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ సైరస్ పూనావాలా (రూ.173, 642.62 కోట్లు) నాలుగో ప్లేస్‌లో, హెచ్‌సీఎల్ సంస్థ యజమాని శివ్ నాడార్ (రూ. 172,834.97కోట్లు) ఐదో ప్లేస్‌లో ఉన్నారు. ఓపీ జిందాల్ ఛైర్ పర్సన్ సావిత్రి జిందాల్ రూ. 132, 452.97 కోట్ల ఆదాయంతో ఆరో ప్లేస్ దక్కించుకున్నారు. సన్‌ఫార్మాసూటికల్స్ స్థాపకుడు దిలీప్ సంఘ్వీ (రూ.125,184.21కోట్లు) ఏడో స్థానం, హిందూజ బ్రదర్స్ (రూ.122,761.29కోట్లు) ఎనిమిదో ప్లేస్‌లో, కుమార మంగళం బిర్లా రూ.121,146.01కోట్లతో తొమ్మిదో స్థానంలో నిలిచారు. రూ.117,915.45 కోట్ల ఆదాయంతో బజాజ్ ఫ్యామిలీ పదో ప్లేస్‌లో నిలిచింది. ఈ పది మంది సంపాదన 350 బిలియన్ డాలర్లు ఉంటుందని ఫోర్బ్స్ తెలిపింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indiramma Illu | ఆశలు కూల్చిన ‘ఇందిరమ్మ’!.. పాత ఇల్లు కూల్చేయడంతో నిలువనీడ లేక.. ఖాళీ స్థలంలోనే తల్లి అంత్యక్రియలు!
Thummala Nageshwara Rao | యాసంగిలో వరి వేయొద్దు.. రైతులకు తుమ్మల నాగేశ్వరరావు సూచన
JNTU | మహబూబాబాద్ జేఎన్టీయూలో అక్రమాలు.. హాస్టల్ డిపాజిట్ పర్సనల్ ఖాతాలోకి!
సాగునీటి వెతలు.. కరెంటు కోతలు.. కరువు కోరలు.. పంట చేతికొచ్చేనా..?
Kodangal | సీఎం ఇలాకాలో బలవంతపు భూ సేకరణ.. మనస్తాపంతో రైతు ఆత్మహత్యాయత్నం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

