WhatsApp | మెటా అనుబంధ మెసేజింగ్ యాప్ ‘వాట్సాప్’ తన యూజర్లు చాటింగ్ అప్లికేషన్‌పై ‘హెచ్డీ ఫొటో షేరింగ్’ ఆప్షన్ అందుబాటులోకి తెచ్చింది. వచ్చే కొన్ని వారాల్లో మెటా ఈ ఫీచర్ తన యూజర్లకు అందుబాటులోకి తేనున్నది. తాజాగా హై క్వాలిటీ, హై రిజొల్యూషన్ (హెచ్డీ) ఫొటోలు కూడా వాట్సాప్ చాటింగ్ లో షేర్ చేయొచ్చు. ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజ్డ్ ఫోన్లలోనూ ఈ ఫీచర్ అందుబాటులోకి రానున్నది. వాట్సాప్ వెబ్, డెస్క్ టాప్ యూజర్లకు స్మాల్ ‘హెచ్డీ’ ఐకాన్‌తో అందుబాటులోకి వస్తుంది. అంతే కాదు త్వరలో హెచ్ డీ వీడియోలూ షేర్ చేసుకునే ఆప్షన్ త్వరలో అందుబాటులోకి తెస్తామని మెటా ప్రకటించింది.
హెచ్డీ ఐకాన్ యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. దీనికి సంబంధించిన చాట్ థ్రెడ్‌కు జత చేసిన ఫొటోను మెటా సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ గురువారం తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు. గత జూన్‌లో ప్రయోగాత్మకంగా పరీక్షించారు. అలా పంపిన హెచ్డీ రిజొల్యూషన్ ఫొటోలు క్లియర్ గా ఉన్నా.. ఫోన్లలో మొబైల్ డేటా ఖర్చయిపోతుంది. అలాగే స్టోరేజీ స్పేస్ కూడా మరింత అవసరం.
ఇలా వచ్చిన హెచ్డీ ఫొటోలను లో ఇంటర్నెట్ స్పీడ్ ఉన్న వారు డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. స్వల్పంగా హెచ్డీ ఫొటో కంప్రెస్ చేసి పంపితే షేర్ అవుతుందని తెలిపింది. అయితే ప్రతి హెచ్డీ ఫొటో షేర్ చేసినప్పుడు మాన్యువల్‌గా హెచ్డీ ఆప్షన్ ఎంచుకోవాల్సి ఉంటుంది. ఆపిల్ ఐ-మెసేజ్ లేదా ఇతర ప్లాట్ ఫామ్ కంటే మెరుగైన రక్షణ ఉంటుందని చెబుతున్నారు.