Spotify | సంగీత ప్రియులకు గుడ్‌న్యూస్. మీకు ఇష్టమైన పాటలు, ఆల్బమ్, పాడ్‌కాస్ట్‌లను నేరుగా వాట్సాప్ స్టేటస్‌కు షేర్ చేసుకునే వీలుంటుంది. ఇందుకోసం వాట్సాప్ సరికొత్త ఫీచర్‌పై పని చేస్తుంది. స్పాటిఫై నుంచి మాత్రమే ఈ పాటలను నేరుగా షేర్ చేసుకునే వీలుంటుంది. ఇప్పటి వరకు ఫొటోలు, వీడియోలు మాత్రమే స్టేటస్‌గా పెట్టుకునే అవకాశం ఉండగా.. ఇకపై స్టేటస్‌లో పాటలు సైతం షేర్ చేసుకోవచ్చు. ప్రతి పాట, ఆల్బమ్, పాడ్‌కాస్ట్‌లో కొత్త షేర్ బటన్ ఉంటుందని స్పాటిఫై (Spotify) వెల్లడించింది. ఈ బటన్ని ట్యాప్ చేయడం వల్ల వాట్సాప్‌తో సహా మల్టిపుల్ షేరింగ్ ఆప్షన్స్ ఉంటాయని చెప్పింది. కేవలం ఒకే ట్యాప్‌తో మీకు ఇష్టమైన ట్రాక్‌ను నేరుగా వాట్సాప్‌కు జోడించవచ్చని చెప్పింది. ఈ ఫీచర్‌ని క్రమంగా అందుబాటులోకి తీసువస్తుంది. ప్రస్తుతం మొబైల్స్‌లో ఈ బటన్ కనిపిస్తుంది.
ఎవరికైనా కనిపించకపోతే త్వరలోనే అందుబాటులోకి వస్తుందని పేర్కొంది. ఈ ఫీచర్ కేవలం మ్యూజిక్కు మాత్రమే పరిమితం కాకుండా స్టేటస్‌లో ఇష్టమైన పాడ్‌కాస్ట్, ఆడియో బుక్, స్పాటిఫై షోను సైతం షేర్ చేయొచ్చు. ఇది మీ ఫ్రెండ్స్, కుటుంబీకులు స్పాటిఫై యాప్‌లో మీ స్టేటస్‌ని నేరుగా పాటలు, పాడ్‌కాస్ట్‌ను వినేందుకు అనుమతి ఇస్తుంది. ఇకపై య్పాటిఫై ప్రతి పాట, షో కింద షేర్ బటన్ ఇస్తుంది. దానిపై ప్రెస్ చేసి వాట్సాప్ ఆప్షన్ ఎంచుకొని ఆపై మై స్టేటస్‌లోకి వెళ్లి వాట్సాప్ అకౌంట్‌కి పోస్ట్ చేయాలి. కొన్ని సెకన్లలోనే మీకు ఇష్టమైన ట్రాక్ స్టేటస్‌లో కనిపిస్తుంది. మీ కాంటాక్ట్స్ వినడానికి, చూసేందుకు అందుబాటులో ఉంటుంది. దీని కోసం ముందుగా మీ ఫోన్లో స్పాటిఫై యాప్‌ను ఓపెన్ చేయాలి. ఆ తర్వాత పాట, ఆల్బమ్, పాడ్‌కాస్ట్‌ను ఎంపిక చేసుకోవాలి.
మీరు షేర్ చేయాలనుకుంటున్న ట్రాక్‌ని ఎంచుకోవాలి. షేర్ బట్‌ను ప్రెస్ చేసి దిగువన లేదంటే కుడివైపున కనిపించే షేర్ సింబల్‌ని క్లిక్ చేయాలి. ఇందులో వాట్సాప్‌ని ఎంపిక చేసుకొని.. ఇక్కడ షేరింగ్ ఆప్షన్స్ నుంచి వాట్సాప్‌ని ఎంపిక చేయాలి. వాట్సాప్ ఓపెన్ అయ్యాక మై స్టేటస్‌ని ఎంచుకొని.. అనంతరం పోస్ట్‌పై క్లిక్ చేయాలి. దాంతో మీకు ఇష్టమైన మ్యూజిక్ మీ స్టేటస్‌లోకి వెళ్తుంది. మీ కాంటాక్ట్ లిస్ట్‌లో ఉన్న వారందరూ మీ స్టేటస్‌ను వినేందుకు అవకాశం ఉంటుంది. ఎవరైనా మీ స్టేటస్ నుంచి మ్యూజిక్ వినొచ్చు. ఈ ఫీచర్ అందరికీ అందుబాటులో లేదని.. త్వరలోనూ యూజర్లందరికీ అందుబాటులోకి వస్తుందని స్పాటిఫై చెప్పింది. ప్రస్తుతం స్పాటిఫైలో ఆప్షన్ కనిపించకపోతే.. త్వరలో రానున్న అప్డేట్లో ఖచ్చితంగా అందుబాటులోకి వస్తుందని చెప్పింది.