WhatsApp | ఇన్స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ వాట్సాప్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది మెటా కంపెనీ యాప్‌ను ఉపయోగిస్తున్నారు. వాట్సాప్‌కు 3.5 బిలియన్లకుపైగా యూజర్లు ఉన్నారు. మేసేజింగ్, ఫొటోలు, వీడియోలు, వాయిస్ కాల్స్, వీడియో కాల్స్, మనీ ట్రాన్స్ఫర్ ఫీచర్స్ ఉన్నాయి. అదే సమయంలో ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్స్‌ను తీసుకువస్తూ యూజర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నది. తాజాగా మరో ఫీచర్‌ను తీసుకురాబోతున్నది. ఈ డయలర్ హబ్ ఫీచర్ సాయంతో కాంటాక్ట్ నంబర్ సేవ్ చేసుకునే వీలు కల్పిస్తున్నది. అలాగే ప్రత్యేకంగా చాట్ విండోను సైతం ఓపెన్ చేయాల్సి అవసరం ఉండదు. చాలామంది తమ పనులపై ఎవరికైనా వాట్సాప్ కాల్ చేయాలనుకున్నప్పుడు ప్రస్తుతం నంబర్ సేవ్ చేసుకొని మాట్లాడుతుంటారు.
కొత్త వ్యక్తులకు ఎక్కువ ఫోన్లు చేయాల్సిన వచ్చిన సమయంలో ప్రతిసారీ కాంటాక్ట్ నంబర్‌ను సేవ్ చేయాల్సిన ఇబ్బంది ఉంది. అదే సమయంలో మొబైల్ కాంటాక్ట్ లిస్ట్ భారీగా పెరుగుతుంది. వాట్సాప్ తీసుకువస్తున్న కొత్త అప్డేట్తో మీరు ఇకపై ఎవరికైనా కాల్ చేయడానికి చాట్‌ను ఓపెన్ చేయాల్సిన అవసరం గానీ.. నంబర్‌ను సేవ్ చేయాల్సిన పని ఉండదు. ఆండ్రాయిడ్, ఐవోఎస్ యూజర్ల కోసం కొత్త కాల్ హబ్ అన్ని కాలింగ్ ఫీచర్స్‌ను ఒకే చోటుకు తీసుకువస్తున్నది వాట్సాప్. యూజర్లు ఇకపై వేర్వేరు స్క్రీన్లకు నావిగేట్ చేయకుండా కాల్స్‌ను చేయొచ్చు. కాల్ షెడ్యూల్ పెట్టొచ్చు. డయలర్‌ను ఉపయోగించవచ్చు. కొత్త కాల్స్ ట్యాబ్ ఇప్పుడు ఏకీకృత ఇంటర్ఫేస్ను కలిగి ఉంది. ఇక్కడి నుంచే యూజర్లు నేరుగా కాల్ చేసుకోవచ్చు.
కాల్స్‌ను కాల్‌లను షెడ్యూల్ చేయడంతో పాటు డయలర్ నుంచి నంబర్‌కి డయల్ చేయొచ్చు. ఈ మార్పు కాలింగ్‌ను వేగంగా, సులభతరంగా ఉండనున్నది. యూజర్లు మొదట కాల్స్ బటన్‌పై క్లిక్ చేయాల్సి. ఆ తర్వాత కుడివైపున పైన పస్ల్ గుర్తు కనిపిస్తుంది. ఇందులో న్యూ కాల్ లింక్, కాల్ ఏ నంబర్, న్యూ కాంటాక్ట్, షెడ్యూల్ కాల్స్ ఆప్షన్ కనిపిస్తాయి. ఇందులో ఇందులో కాల్ ఏ నంబర్‌పై క్లిక్ చేస్తే డయలర్ ఓపెన్ అవుతుంది. ఏ నంబర్‌కు అయితే ఫోన్ చేయాలనుకున్నారో ఆ నంబర్ నెంబర్‌ను ఎంటర్ చేసి కాల్ చేయవచ్చు. కాల్‌ను సైతం షెడ్యూల్ చేసుకునే వీలుంటుంది. కొత్త షెడ్యూలింగ్ ఫీచర్ ముందుగానే కాల్‌లను ప్లాన్ చేసుకోవడానికి, చాట్ ద్వారా వివరాలను పంచుకోవడానికి అనుమతి ఉంటుంది. ఇక బిజెనెస్ అకౌంట్స్ ఇప్పుడు వెరిఫికేషన్ బ్యాడ్జ్ అందుకుంటాయి. ఖాతా నిజమైనదా? కదా? అని యూజర్లు సులభంగా గుర్తించేందుకు వీలుంటుంది. ఈ ఫీచర్ మోసాల బారినపడకుండా కాపాడుతుంది. కొత్త కాల్ హబ్ ఫీచర్ కాలింగ్‌ను సులభతరం చేస్తుంది.