న్యూఢిల్లీ, నవంబర్ 15: వాట్సాప్ ఇండియా అధిపతి అభిజిత్ బోస్ రాజీనామా చేశారు. అలాగే మెటా పబ్లిక్ పాలసీ అధిపతి రాజీవ్ అగర్వాల్ సైతం తప్పుకున్నట్టు మంగళవారం సామాజిక మాధ్యమ దిగ్గజం మెటా తెలియజేసింది. అయితే ప్రపంచవ్యాప్తంగా 11వేల మందిని తొలగిస్తున్నట్టు మెటా ప్రకటించిన వారం రోజుల్లోపే ఈ రాజీనామాలు జరగడం అత్యంత ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి.