WhatsApp : ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ మెషీన్ లెర్నింగ్, డేటా అనలిటిక్స్ ఉపయోగించి అనుమానాస్పద ఖాతాలను గుర్తించి నిషేధిస్తోంది. స్కామర్స్, ప్రైవసీ పాలసీలను ఉల్లంఘించిన లక్షలాది ఇండియన్ యూజర్స్‌ను వాట్సాప్ నిషేధించింది. వాట్సాప్ తన తాజా భారత్ మంత్లీ రిపోర్ట్‌లో ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ పలు వివరాలు వెల్లడించింది.
ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్30 మధ్య నిబంధనలను ఉల్లంఘించిన దాదాపు 71 లక్షల భారత యూజర్లను నిషేధించినట్టు పేర్కొంది. తమ ప్లాట్‌ఫాం దుర్వినియోగం నివారించి మెరుగ్గా రూపొందించేందుకు వీలుగా ఈ చర్యలు చేపట్టినట్టు వెల్లడించింది. యూజర్లు తమ నిబంధనలను ఉల్లంఘించడం కొనసాగిస్తే మరిన్ని బ్యాన్స్ అమలుచేయక తప్పదని స్పష్టం చేసింది.
ఏప్రిల్‌లో ఏకంగా 71,82,000 అకౌంట్స్‌ను వాట్పాప్ బ్యాన్ చేసింది. వీటిలో 13,02,000 ఖాతాలను ఎలాంటి ఫిర్యాదులు రాకముందే బ్యాన్ చేయడం విశేషం. తమ ప్లాట్‌ఫాం వేదికగా ఇతర యూజర్లకు ఇబ్బందులు, వేధింపులు ఎదురుకాకముందే అనుమానిత ఖాతాలను గుర్తించి వాటిని వాట్సాప్ బ్యాన్ చేసింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో అకౌంట్ సపోర్ట్, బ్యాన్ అభ్యర్ధనలు, ప్రోడక్ట్ సపోర్ట్, భద్రతా ఆందోళనల వంటి వివిధ అంశాలపై 10,554 యూజర్ రిపోర్ట్స్‌ను కంపెనీ స్వీకరించింది.
Read More :