రష్యా నుంచి స్పుత్నిక్ ఎం కొవిడ్ వ్యాక్సిన్‌ను తీసుకొస్తామని డాక్టర్ రెడ్డీస్ ప్రకటించింది. 12-18 సంవత్సరాల మధ్య టీనేజర్లకు వేసే ఈ టీకాలను భారత్‌కు తెచ్చేందుకు ఇక్కడి డ్రగ్ రెగ్యులేటర్‌తో సంప్రదింపులు జరుపుతున్నట్టు డాక్టర్ రెడ్డీస్ సీఈవో దీపక్ సప్రా చెప్పారు. రష్యా రెగ్యులేటర్ ఈ వ్యాక్సిన్‌ను అక్కడ వినియోగించేందుకు ఇప్పటికే అనుమతిని మంజూరుచేసింది. భారత్ నియంత్రణా సంస్థ ఆదేశిస్తే ఇండియాలో ఆ వ్యాక్సిన్‌పై మరో రౌండు క్లినికల్ ట్రయిల్స్ నిర్వహిస్తామని సప్రా తెలిపారు. స్పుత్నిక్ ఎం వినియోగానికి అనుమతి కోరుతూ గత నెలలో రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (ఆర్డీఐఎఫ్)..డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియాకు దరఖాస్తు చేసింది. 2021 నవంబర్‌లో రష్యా ఆరోగ్యశాఖ ఈ వ్యాక్సిన్‌ను రిజిష్టర్ చేసింది. స్పుత్నిక్ లైట్ సింగిల్ డోస్ వ్యాక్సిన్ ఫేజ్ 3 క్లినికల్ ట్రయిల్స్ డాటాను రెగ్యులేటర్‌కు సమర్పించామని, అనుమతి కోసం వేచిచూస్తున్నామని సప్రా తెలిపారు.