హైదరాబాద్, ఆగస్టు 26: మెడ్‌ప్లస్ హెల్త్ సర్వీసెస్‌లో తనకున్న మొత్తం వాటాను విక్రయించింది ప్రైవేట్ ఈక్విటీ దిగ్గజం వార్బర్గ్ పింకస్. 11.35 శాతం వాటాను ఒపెన్ మార్కెట్లో విక్రయించడంతో రూ.836 కోట్ల నిధులు సమకూరాయి.
పూర్తిగా బ్లాక్ డీల్ ద్వారా జరిగిన ఈ 11.35 శాతానికి సమానమైన 1.35 కోట్ల ఈక్విటీ షేర్లను ఒక్కో షేరుకు రూ.616.48 చొప్పున విక్రయించింది. దీంట్లో సింగపూర్ గవర్నమెంట్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్లు 62.45 లక్షల షేర్లు లేదా 5.2 శాతం వాటాను కొనుగోలు చేశాయి.