PNB Server Vulnerable | కేంద్ర ప్రభుత్వ రంగ బ్యాంక్.. పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ)లో సెక్యూరిటీ లోపం బయటపడింది. 18 కోట్ల మంది పీఎన్బీ ఖాతాదారుల పర్సనల్, ఫైనాన్సియల్ డేటా ఏడు నెలలుగా బహిర్గతం అవుతుందని సైబర్ సెక్యూరిటీ సంస్థ సైబర్ఎక్స్9 ప్రకటించింది. బ్యాంక్ అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్లో ఉండే యావత్ డిజిటల్ బ్యాంకింగ్ సిస్టం సర్వర్‌లో తలెత్తిన సాంకేతిక లోపం వల్ల మొత్తం బ్యాంకు సమాచారం తెలుసుకోవచ్చునని వ్యాఖ్యానించింది. తమ ఖాతాదారుల సమాచారంతో పీఎన్బీ రాజీ పడిందని సైబర్ ఎక్స్9 వ్యాఖ్యానించింది. దీన్ని తాము గుర్తించి సీఈఆర్టీ-ఇన్, ఎన్సీఐఐపీసీ ద్వారా తెలిపిన తర్వాతే పీఎన్బీ అధికారులు మేల్కోన్నారని, సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టారని సైబర్ ఎక్స్ 9 వ్యవస్థాపకుడు-ఎండీ హిమాంశు పాఠక్ చెప్పారు.
బ్యాంక్ అడ్మినిస్ట్రేషన్ యాక్సెస్ చేసుకునే ఇంటర్నల్ సర్వర్ల వద్ద చాలా కీలకమైన సెక్యూరిటీ సమస్య తలెత్తింది. దీనివల్ల ఏడు నెలలుగా దేశవ్యాప్తంగా సదరు బ్యాంక్ సిస్టమ్స్ సైబర్ దాడులకు గురయ్యే పరిస్థితి నెలకొందని హిమాంశు పాఠక్ తెలిపారు. అన్ని రకాల ఈ-మెయిల్స్‌తోపాటు ఇతర ఎక్స్చేంజీలు, షేర్ల వివరాలతో అనుసంధానమైన ఎక్స్చేంజ్ సర్వర్‌లో ఈ లోపం ఉందని తేలింది. పీఎన్బీ ఎక్స్చేంజ్ సర్వర్లు బ్యాంక్ ఉన్నతస్థాయి అధికారులకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. కానీ అవన్నీ బహిర్గతమయ్యాయని సైబర్ ఎక్స్9 వివరించింది. వివిధ శాఖలు, విభాగాలు వాడే కంప్యూటర్లలోనూ ఈ లోపం ఉందని నిర్ధారించారు.
సైబర్ ఎక్స్9 ఆరోపణలపై పీఎన్బీ స్పందించింది. తమ బ్యాంక్ సర్వర్‌లో సాంకేతిక లోపం ఉన్న మాట నిజమేనని ధృవీకరించింది. అయితే ఎటువంటి కీలక డేటా గానీ, ఖాతాదారుల వ్యక్తిగత, ఫైనాన్సియల్ డేటా బహిర్గతం కాలేదని పేర్కొంది. ముందు జాగ్రత్త చర్యగా సదరు సర్వర్‌ను షట్‌డౌన్ చేశామని వివరణ ఇచ్చింది. సర్వర్ సమాచారం బహిర్గతం అవుతుందన్న సమాచారం తమ దృష్టికి వచ్చిందని, ఆన్ప్రిమ్ టు ఆఫీస్ 365 క్లౌడ్ వరకు ఈ-మెయిల్స్ పంపడానికి వాడే మల్టీపుల్ ఎక్స్చేంజ్ హైబ్రీడ్ సర్వర్లలో ఒక సర్వర్‌లో ఈ లోపం తలెత్తిందని తెలిపింది. కానీ ఈ సర్వర్‌లో కీలకమైన సున్నిత డేటా లేదని పేర్కొంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
WhatsApp : వాట్సప్‌లో సరికొత్త ఫీచర్.. గ్లోబల్ పేమెంట్ ట్రాన్స్ఫర్ కోసం డిజిటల్ వాలెట్
WhatsApp : వాట్సప్‌లో సరికొత్త ఫీచర్.. మల్టీ డివైజ్ సపోర్ట్.. ఎనేబుల్ చేసుకోండిలా
WhatsApp : మీ నెంబర్ కే వాట్సప్ మెసేజ్ పంపించుకోవడం ఎలా? ముఖ్యమైన సమాచారం ఉంటే ఇలా షేర్ చేసుకోండి
లాస్ట్ సీన్.. ఎవరు చూడాలనేది ఇక మన ఇష్టం
WhatsApp : 2021 ముగిసేనాటికి ఈ ఫోన్లలో వాట్సప్ పనిచేయదు.. ఇదిగో ఆ లిస్టు!